'ఆర్జీవీ మిస్సింగ్' ట్రైలర్ వచ్చేసింది.. - MicTv.in - Telugu News
mictv telugu

‘ఆర్జీవీ మిస్సింగ్’ ట్రైలర్ వచ్చేసింది..

October 25, 2020

ram gopal varma

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెరలేపారు. వర్మ కిడ్నాప్ అయితే ఎలా ఉంటుందనే ఆసక్తికరమైన  కథతో ఓ సినిమా తీసాడు. దానికి ‘ఆర్జీవీ మిస్సింగ్’ అనే టైటిల్ ఫిక్స్ చేశాడు. తాజాగా ఈ రోజు విజయదశమి పండుగ సంగర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. 

ఈ సినిమాలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, కేఏ పాల్ లను పోలిన పాత్రలున్నాయి. ఈ సినిమాలో మిస్సయిన ఆర్జీవీని రజినీకాంత్ పోలికలతో ఉన్న గజనీకాంత్ అనే ఆఫీసర్ వెతుకుతున్నాడు. రామ్ గోపాల్ వర్మ సమర్పణలో రూపొందుతున్న ఈ ‘ఆర్జీవీ మిస్సింగ్’ చిత్రాన్ని కేవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చటర్జీ నిర్మిస్తుండగా అదిర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.