RGV On VH : ‘O Grandpa, Are You Still There?’ Ramgopal Varma’s Satirical Tweet On VH
mictv telugu

RGV On VH : ఓ తాతగారూ మీరింకా ఉన్నారా..? వీహెచ్‎పై ఆర్జీవీ సెటైర్లు..

March 19, 2023

RGV On VH : ‘O Grandpa, Are You Still There?’ Ramgopal Varma’s Satirical Tweet On VH

తన సినిమాలు, చేష్టలతో ఎప్పుడూ వివాదాల్లో ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా మరో వివాదానికి తెరలేపాడు. అతడు ఇటీవల ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. ఆర్జీవీ వ్యాఖ్యలను పలువురు తప్పుబడుతున్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ వీహెచ్ కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. ఆర్జీవీ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు వీహెచ్. అతడిపై చర్యలు తీసుకోవాలని ఏకంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఆర్జీవీ మహిళలను అవమానపరిచారంటూ ..దీనిపై ఇండస్ట్రీ నుంచి ఎవరూ స్పందించకపోవడం దారుణమన్నారు. ఇలానే వదిలేస్తే..మహిళలపై గౌరవం పోతుందని ఆవేదని వ్యక్తం చేశారు. వర్మకు దమ్ముంటే ఉస్మానియా లేదా కాకతీయ యూనివర్సిటీకి వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేయాలని సవాల్ విసిరారు. నాగార్జున వర్సిటీ వీసీని సస్పెండ్‌ చేసి, ఆర్జీవీ మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అయితే వీహెచ్ ఆరోపణలకు ఆర్జీవీ తనదైన స్టైల్‎లో కౌంటర్ ఇచ్చారు.

‘‘ఓ తాతగారూ మీరింకా ఉన్నారా??? నాసా యాక్ట్ వర్తించదు టాడా యాక్ట్‌ని 1995 లోనే తీసేశారు.. ఇది కూడా తెలియని మీ లాంటి లీడర్స్ మూలానే కాంగ్రెస్‌కి ఆ గతి.. ఒక సారి డాక్టర్‌కి చూపించుకోండి’’ అని ట్వీట్ చేశాడు.

ఆర్జీవీ ఏమన్నాడంటే..

ఇటీవల నాగార్జున యూనివర్సిటీకి సంబంధించిన ఓ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‎గా ఆర్జీవీ వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరికీ నచ్చింది వారు చేయాలని సూచించారు. తినండి, తాగండి లైఫ్ ను ఎంజాయ్ చేయండని వ్యాఖ్యానించారు. అంతేగాక పక్కనఉన్నవారి గురించి ఆలోచించొద్దని సూచించారు. ఇక నేను చనిపోయాక స్వర్గానికి వెళ్తే అక్కడ ఏం లేకపోతే బాధపడాలి. అందుకే బతికి ఉన్నప్పుడే అన్ని అనుభవించాలి. స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనకలు ఉండకపోవచ్చ అంటూ ప్రసంగించారు. అంతటితో ఆగకుండా కొత్త వైరస్ వచ్చి తాను తప్ప మిగతా మగజాతి అంతా పోవాలని అప్పుడు మహిళలందరికి తానే దిక్కు అవుతాను అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కళాశాలలో ఆర్జీవీ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. విద్యార్థులకు రాంగోపాల్ వర్మ సెక్స్ పాఠాలు బోధించాడని పలు విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళనలు చేపట్టాయి.