తొలిసారి వెనకడుగు వేసిన ఆర్జీవీ.. ఎందుకో చూడండి - MicTv.in - Telugu News
mictv telugu

తొలిసారి వెనకడుగు వేసిన ఆర్జీవీ.. ఎందుకో చూడండి

April 7, 2022

bfbb

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ తొలిసారి తన సినిమా విషయంలో వెనకడుగు వేశారు. స్వలింగ సంపర్కం నేపథ్యంలో ఆయన తీసిన ‘డేంజరస్’ (తెలుగులో మా ఇష్టం) సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. ఈ చిత్రం ఏప్రిల్ 8న విడుదల చేస్తున్నట్టు మొదట ప్రకటించగా.. సినిమాను ప్రదర్శించడానికి థియేటర్లు ముందుకు రావట్లేదనే కారణంతో వాయిదా వేశారు. ఇంతకు ముందు పీవీఆర్, ఐనాక్స్ సినిమాస్ సంస్థలు ఈ సినిమాను బహిష్కరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ బాటలోనే మరికొన్ని థియేటర్స్ నడిచాయని తాజా సమాచారం. ఈ నేపథ్యంలో సినిమా విడుదల వాయిదాను ప్రకటించిన ఆర్జీవీ.. త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తానని వెల్లడించారు. తన చిత్రానికి జరుగుతున్న అన్యాయంపై వివిధ మార్గాల్లో పోరాటం చేస్తానని ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు. కాగా, అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రధారులుగా నటించిన డేంజరస్ చిత్రం భారతదేశంలో తొలి లెస్బియన్ చిత్రంగా రికార్డులకెక్కింది.