RGV ‘పవర్ స్టార్’ ఫస్ట్ లుక్ రచ్చ.. టీ గ్లాస్, ఎన్నికలే టార్గెట్ - MicTv.in - Telugu News
mictv telugu

RGV ‘పవర్ స్టార్’ ఫస్ట్ లుక్ రచ్చ.. టీ గ్లాస్, ఎన్నికలే టార్గెట్

July 9, 2020

RGV Power Star First Look

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నట్టుగానే ‘పవర్ స్టార్’ సినిమాపై పట్టుదలతో ఉన్నాడు. తాజాగా ఆ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసి మరోసారి సంచలనం రేపాడు. టైటిల్ లోగోలో టీ గ్లాసు ఉండటం, ఎన్నికల  ఫలిత తర్వాత అంటూ పోస్టర్‌పై రాసి ఉంది. అందులో ఉన్న నటుడు కూడా నల్లటి దుస్తులు ధరించి దిగులుగా కూర్చొని కనిపిస్తున్నాడు. ఈ సినిమా ఎవరిని ఉద్దేశించింది కాదని చెబుతున్నా.. వర్మ కావాలనే టార్గెట్ చేసుకొని సినిమా చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. 

కాగా ఇటీవల తన కొత్త సినిమా ‘పవర్ స్టార్’ అని ప్రకటించి ఓ నటుడిని కూడా పరిచయం చేశాడు. దీంట్లో భాగంగా సినిమా ఫస్ట్‌లుక్ కూడా విడుదల చేసి షూటింగ్‌కు సిద్ధం అవుతున్నాడు. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తిగా మారింది. కాగా ఈ సినిమాను థియేటర్స్‌లో కాకుండా ఆన్‌లైన్ ద్వారా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఫస్ట్‌లుక్ మొత్తం జనసేన పార్టీ గుర్తు, ఆ పార్టీ అధినేతను పోలి ఉన్న వ్యక్తి ఉండటం, పేరు కూడా అలాగే ఉండటంతో పవన్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది.