ఆర్జీవీ ‘పవర్ స్టార్’ ఇతడే.. పేరు నరేష్, ఊరు సారపాక - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్జీవీ ‘పవర్ స్టార్’ ఇతడే.. పేరు నరేష్, ఊరు సారపాక

June 30, 2020

gnfgnvn

ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అని నానుడి. అసాధారణ సందర్భాల్లోనే ఇలాంటి వారు తారాసపడుతుంటారు. కానీ టాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు మాత్రం ఇలా ఒకరి పోలికలతో ఉన్న మరొకరిని సులువుగా పట్టేసుకుంటాడు. కొన్ని రోజుల క్రితం తన సినిమా కోసం టీడీపీ అధినేత చంద్రబాబును పోలీ ఉన్న వ్యక్తిని పట్టుకొని అందరిని ఆశ్చర్యపరిచాడు. తాజాగా తన కొత్త సినిమా కోసం పవన్ కల్యాన్‌ పోలికలతో ఉన్న వ్యక్తిని పరిచయం చేసి మరోసారి ట్విస్ట్ ఇచ్చాడు. 

తాను త్వరలో చేయబోయే కొత్త సినిమా ‘పవర్ స్టార్’ అంటూ ఇటీవల ప్రకటించాడు. అందులో నటించే వ్యక్తి  పవన్ కల్యాన్‌ను పోలి ఉన్నట్టుగా ఫొటోను రివీల్ చేశాడు. ఇది వైరల్ కావడంతో తాజాగా వీడియోను రిలీజ్ చేశాడు.దీంతో అతని వివరాల కోసం నెటిజన్లు ఆసక్తిగా వెతుకుతున్నారు. అతని పేరు నరేష్ అని తేలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక గ్రామానికి చెందిన వాడు. తరుచూ టిక్‌టాక్ వీడియోలు చేస్తూ.. జూనియర్ పవర్ స్టార్‌గా చాలా మందికి పరిచయం అయ్యాడు. ఇవి చూసిన వర్మ తన కారు పంపించి తన ఆఫీసుకు పిలిపించుకున్నాడు. పవర్ స్టార్ సినిమా నటుడిగా అతన్ని ఎంచుకున్నాడు. మరో 10 రోజుల్లోనే సినిమా షూటింగ్ కూడా ప్రారంభించేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నాడు. కాగా దీనికి సంబంధించిన పూర్తి డీల్ ఇంకా జరగాల్సి ఉందని సమాచారం.