కేజీఎఫ్ డైరెక్టర్‌పై..ఆర్జీవీ ప్రశంసలు - MicTv.in - Telugu News
mictv telugu

కేజీఎఫ్ డైరెక్టర్‌పై..ఆర్జీవీ ప్రశంసలు

May 5, 2022

టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ ఆర్టీవీ కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. “ప్రశాంత్ నీల్ నువ్వు భారతీయ చలన చిత్ర పరిశ్రమకు ఒక వీరప్పన్‌ లాంటివాడివి. ‘కేజీఎఫ్’తో కన్నడ చిత్ర పరిశ్రమతోపాటు కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్‌లో ఉన్న ప్రతి దర్శకుడి మనసును కొల్లగొట్టావు. అందుకు ‘దర్శకుల దినోత్సవ’ శుభాకాంక్షలు. “కేజీఎఫ్-2′ ఎందుకంత విజయం, క్రేజ్ సొంతం చేసుకుందో తెలియక చాలామంది తమ సినిమాలను రీషూట్, రీ డ్రాఫ్ట్, పునరాలోచన చేస్తూ, టన్నుల కొద్దీ డబ్బును వృథాగా ఖర్చు చేసేస్తున్నారు. చిత్రపరిశ్రమలో 85శాతం మంది సంప్రదాయమైన వారు ఉన్నారు. వారికి ‘కేజీఎఫ్-2’ నచ్చలేదు. పాత సినీ పరిశ్రమను బయటకు నెట్టి, కొత్త సినీ పరిశ్రమకు జీవం పోశాడనటానికి ఇదే నిదర్శనం. ఆ కొత్త పరిశ్రమ పేరే కేజీఎఫ్-2” అని ఆయన అన్నారు.

మరోపక్క కేజీఎఫ్-2 సినిమా గత సినిమాల రికార్డులను బద్దలు కొడుతూ, దూసుకుపోతోంది. సినిమా విడుదలైన రోజునుంచి నేటీవరకు భారీ కలెక్షన్లు వసూలు చేస్తూ, 1000కోట్ల జాబితాలో చేరింది. సినిమాలో హీరో యష్ నటన ఒక ఎత్తు అయితే, డైరెక్టర్ పనితీరు మరో ఎత్తుగా నిలవడంతో అన్నీ పరిశ్రమల డైరెక్టర్లు, హీరోలు ప్రశాంత్ నీల్‌ను తెగ మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం ‘దర్శకుల దినోత్సవం’ సందర్భంగా ఆర్జీవీ ప్రశాంత్ నీల్‌పై ప్రశంసలు జల్లు కురింపించారు.