లక్ష్మీపార్వతిని అవమానిస్తే ఎన్టీఆర్‌ను అవమానించినట్లే.. వర్మ - MicTv.in - Telugu News
mictv telugu

లక్ష్మీపార్వతిని అవమానిస్తే ఎన్టీఆర్‌ను అవమానించినట్లే.. వర్మ

October 19, 2018

నందమూరి తారకరామారావు జీవితంలోని చివరి అంకాన్ని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో చలనచిత్రంగా మలుస్తున్న వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తానెందుకు ఆ సినిమా తీస్తున్నానో వెల్లడించాడు. దీనికి సంబంధించి ఓ వీడియోను విడుదల చేశారు.

rfr

‘ఎన్టీఆర్ చనిపోయే ముందు లక్ష్మిగారి గురించి ఒక ఇంటర్వ్యూలో ఎనలేని గౌరవంతో మాట్లాడు. అందువల్లే ఆమెను ఎవరైనా అవమానిస్తే సాక్షాత్తూ ఎన్టీఆర్ ను అవమానించినట్లే, అనుమానించినట్లే.. ఈ సినిమా కోసం చాలామందితో మాట్లాడాను. కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయటపడ్డాయి.. నిరూపించని నిజాలు నా చిత్రంలో ఉంటాయి. ఎలాంటి రాజకీయ దురుద్దేశాలూ ఉండవని చెప్పినా నమ్మరు కనుక చెప్పను. ఎవరు ఏ ఎన్టీర్  సినిమా తీసినా స్వర్గంలోని ఎన్టీఆర్ ఆశీస్సులు మాత్రం మా లక్ష్మీస్ ఎన్టీఆర్‌కే ఉంటాయి. ఇది నా ఓపెన్ చాలెంజ్.. ’ అని అన్నారు.

తాను తిరుమల వెళ్లడానికి కారణం కూడా ఎన్టీఆరేనన్నారు. కాగా, దర్శనం తర్వాత చేతిలో తిరుపతి లడ్డు,  భుజంపై కుండవా, నొదుట బొట్టుతో ఆర్జీవీ ఫక్తు భక్తుడిలా కనిపించాడు. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్’ కోసం ఎన్టీఆర్‌‌ నన్ను ఇలా మార్చేశారని సరదాగా అన్నారు. దీంతో నాస్తిక వర్మ ఇలా అయిపోయాడేంటని జోకులు పేలుతున్నాయి. ఈ అవతారం కూడా కామెడీనా సామీ అని ప్రశ్నిస్తున్నారు. సాయంత్ర 4 గంటలకు తిరుపతిలోని శిల్పారామంలో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా వివరాలను ఆర్జీవి వెల్లడించనున్నాడు.