వివాదాస్పద వ్యాఖ్యలు, సంచలనాలు పేరుపొందిన దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఈయనకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఎప్పుడూ తన గురించి చర్చించుకునేలా లైమ్ లైట్ లో ఉండడం వర్మ స్పెషాలిటీ. అంశం ఏదైనా తనదైన శైలిలో వ్యంగ్యంగా స్పందించడం ఆయనకు అలవాటు. తాజాగా ట్విట్టర్ లో ఓ తనకు పెద్ద పూలమాలతో సత్కరించిన ఫోటోను పోస్ట్ చేశారు.
దాంతో పాటు ‘మా వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ గారి పుట్టినరోజుకి నాకు ఎందుకు దండ వేశారో అర్ధం కాలేదు. వెరీ వెరీ హ్యాపీ బర్త్ డే టు దాసరి కిరణ్’ అంటూ ట్వీట్ చేశారు. దాసరి నిర్మాణంలో ఆర్జీవీ త్వరలో వ్యూహం సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ నేపథ్యంలో తన ప్రొడ్యూసర్ పైనా ఆర్జీవీ ధైర్యంగా వ్యంగ్యంగా కామెంట్ చేయడం ఆయనకే చెల్లిందని వీరాభిమానులు కామెంట్ చేస్తున్నారు. కాగా, వ్యూహం సినిమా ఏపీ రాజకీయాలపై ఉండనుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి.
— Ram Gopal Varma (@RGVzoomin) November 29, 2022