సుశాంత్ మృతిపై సీబీఐ దర్యాప్తు... కేంద్రానికి గర్ల్‌ఫ్రెండ్ లేఖ - MicTv.in - Telugu News
mictv telugu

సుశాంత్ మృతిపై సీబీఐ దర్యాప్తు… కేంద్రానికి గర్ల్‌ఫ్రెండ్ లేఖ

July 16, 2020

బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో ఆయన ప్రియురాలు నటి రియా చక్రవర్తి పేరు బాగా వినిపించింది. సుశాంత్ అంత్యక్రియలకు హాజరైన ఆమె ఇంతవరకు సుశాంత్ మరణంపై స్పందించలేదు. దీనిమీద సోషల్ మీడియాలో అనేక విమవర్శలు వినిపించాయి. ఈ క్రమంలో ఎట్టకేలకు రియా నోరు విప్పింది. సుశాంత్‌ మృతిపై సీబీఐ విచారణ కోరుతూ ఆమె కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసింది. జూన్ 14న ముంబైలోని తన నివాసంలో సుశాంత్ చనిపోయాడు. కొన్ని నెలలుగా ఎదుర్కొంటున్న ఒత్తిడి, నిరాశలో అతడు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పేర్కొంది. ముంబై పోలీసులు కేసు విచారణ చేపట్టాలని కోరింది.

ఈ మేరకు రియా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. తాను సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్‌నని ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో స్పష్టంచేసింది. ఆ పోస్టులో..  ‘గౌరవనీయమైన అమిత్ షా సార్, నేను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తిని. సుశాంత్‌ ఆకస్మిక మరణం చెంది నెల రోజులు దాటింది. కేసు దర్యాప్తులో ప్రభుత్వ విచారణపై పూర్తి నమ్మకం ఉంది. న్యాయం కోసం ఈ విషయంలో సీబీఐ విచారణ చేయాల్సిందిగా మిమ్మల్ని చేతులెత్తి కోరుతున్నాను. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన ఒత్తిళ్లు ఏమిటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సత్యమేవ జయతే’ అంటూ రియా లేఖలో తెలిపింది.