పార్క్లో సఫారీకి వెళ్లిన కొందరు టూరిస్ట్‌లకు భయంకరమైన అనుభవం ఎదురైంది. వారి వాహనాన్ని రెండు ఖడ్గమృగాలు వెంబడించాయి. బంగాల్ ఆలీపుర్ద్వార్ జిల్లాలోని జలదాపరా నేషనల్ పార్క్లో షికారుకి వెళ్లిన వీరిపై ఒక్కసారిగా ఖడ్గమృగాలు దూసుకొచ్చాయి. వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ వాహనం బోల్తా పడింది. ఘటనలో మొత్తం ఐదుగురు గాయపడ్డారు. ప్రస్తుతం వీరంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన జరిగిన సమయంలో వాహనంలో మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. వారిలో ఆరుగురు పర్యాటకులు ఒక డ్రైవర్, గైడ్ ఉన్నారు. శనివారం ఈ ఘటన జరిగింది.
గతేడాది అస్సాం రాష్ట్రంలోని కాజీరంగ్ నేషనల్ పార్క్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. మూడు జీపుల్లో సఫారీకి వెళ్లిన వారిని ఓ ఖడ్గమృగం వెంబడించింది. సుమారు మూడు కిలోమీరట్ల మేర వారి వాహనాలను వెంబడిస్తూ భయాందోళనకు గురి చేసింది. దీంతో వారు దాన్నుంచి తప్పించుకునేందుకు తమ వాహనాలను వేగంగా ముందుకు పోనిచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు.