మంత్రుల్లో నిరాడంబర ముఖ్యమంత్రే టాప్ - MicTv.in - Telugu News
mictv telugu

మంత్రుల్లో నిరాడంబర ముఖ్యమంత్రే టాప్

February 13, 2020

Naveen patnaik

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిరాడంబరానికి మారుపేరు. పెద్దగా వివాదాల జోలికీ పోని ఆయనపై అవినీతి ఆరోపణలు కూడా తక్కువే. అందుకే ఎన్నికల్లో ప్రజలు ఆయనవైపే మొగ్గుచూపుతుంటారు. అలాంటి సీఎం కలకలం రేపారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఆయనే అత్యంత ధనికుడిగా నిలిచారు. 

కేబినెట్‌లో ఆయనకే ఎక్కువ ఆస్తులున్నాయని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించింది. సీఎంతోపాటు మొత్తం 20మంది మంత్రుల ఆస్తుల వివరాలను బయటపెట్టింది. నవీన్ పట్నాయక్ 64.26కోట్ల ఆస్తులతో ప్రథమ స్థానంలో నిలిచారు. ఆయనకు రూ. 63.64 కోట్ల స్తిరాస్తులు, రూ. 62.66 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయి. వీటిలో కొన్ని ఆయన వంశపారంపర్యంగా వచ్చాయి. పంచాయతీ రాజ్ మంత్రి ప్రతాప్ జెనా 9.9 కోట్లతో రెండో స్థానం దక్కించుకున్నారు. ఆయన ఆస్తు ఒక ఏడాదిలో రూ. 4.5 కోట్లు పెరిగాయి. క్రీడలు, ఐటీ శాఖ మంత్రి తుషార్ కాంతి బెహరా రూ. 26లక్షలతో కడమ స్థానంలో నిలిచారు.