ఏ మతపోల్లైనా పెళ్ళికి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే ! - MicTv.in - Telugu News
mictv telugu

ఏ మతపోల్లైనా పెళ్ళికి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే !

August 2, 2017

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం 11 సంవత్సరాల తర్వాత ముక్కి మూలుగుతున్న ‘ వివాహ రిజిస్ట్రేషన్ ’ చట్టాన్ని అమల్లోకి తీస్కొచ్చింది. ఇక నుండి ఎవరు పెళ్లి చేస్కున్నా వరుడు – వధువుల ఫోటోలతో, ఆధార్ కార్డులతో రిజిస్ట్రేషన్ తప్పకుండా చేసుకోవాల్సిందేనని అంటున్నారు. ఈ చట్టం కింద ఆన్ లైన్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేస్కునే విధంగా వెసలుబాటును కల్పిస్తున్నారు. పార్లమెంట్ సాక్షిగా యుపీ సీఎం ఆదిత్యా నాథ్ యోగి పెట్టిన ఈ బిల్లుకు ఆమోద ముద్ర దొరికింది. వరుసగా అన్నీ రాష్ట్రాల్లోనూ ఇది తప్పనిసరి అవుతుండొచ్చంటున్నారు. ఇదంతా బాగానే వుంది కానీ ముస్లిం వర్గాల్లో ఇస్లామిక్ వివాహ ఒప్పందం ప్రకారం రిజిస్ట్రేషన్ పద్దతినే నిఖా జరుగుతుంది. కానీ ఫోటోలు వుండవు. ఆధార్ కార్డుల ప్రాతిపదికన జరుగుతున్నవి. అయితే అన్నీ సామాజిక వర్గాలు చట్ట పరంగానే పెళ్ళిళ్ళు చేస్కోవాలని యూపి ప్రభుత్వం చెబుతోంది. కానీ కొన్ని సామాజిక వర్గాల మనోభావాలు దెబ్బ తింటాయి కదా ? ఆ దిశగా ప్రభుత్వం ఇలాంటి సమస్యకు చూపించే మార్గం ఏంటనేది క్శశ్చన్ ?

మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని గుడ్డిగా అనడం గాకుండా చట్ట పరంగా పెళ్ళి చేస్కోవడం తప్పనిసరి అవుతోందన్నమాట. ఒకరు రెండు, మూడు పెళ్ళిళ్ళు చేస్కునే వీలుండదన్నమాటే. వేద మంత్రాల సాక్షిగా పెళ్ళి చేస్కొని చేతులు దులుపుకోవడం కాదు చట్ట పరంగా కూడా పెళ్ళిని రిజిస్ట్రేషన్ చేస్కోవడం పరిపాటి ఇకనుండి. ఇదొక విధంగా మంచిదేనంటున్నారు ప్రజలు. రెండు, మూడు పెళ్ళిళ్ళు చేస్కొని మోసాలకు పాల్పడుతున్నవారి భరతం పట్టడం కోసమే అన్నట్టుంది ఈ చట్టం. అలా జరక్కుండా వుండాలంటే రిజిస్ట్రేషన్ మ్యారేజెస్ ప్రత్యన్మాయం అనుకున్నట్టున్నారు. అందుకే ఈ చట్టాన్ని అమల్లోకి తేవాలనుకుంటోంది యూపీ ప్రభుత్వం. ఒకసారి రిజిస్ట్రేషన్ చేస్కున్నవారు రెండో పెళ్ళి చేస్కోవాలనుకున్నప్పుడు రికార్డు ప్రకారం దొరికిపోతారు. సో.. దొంగ పెళ్ళిళ్ళకు కాలం చెల్లుతుందన్నమాట ! ఏదేమైనా యూపీ ప్రభుత్వం తీస్కున్న నిర్ణయం మంచిదైనా దాని వెనకాల కొన్ని లూపులున్నవి. వాటిని కాస్త వారివారికి వెసలుబాటయ్యేలా చట్టంలో మార్పులు తెస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.