మహిళలకు ప్రధాని మోదీ భారీ కానుక - MicTv.in - Telugu News
mictv telugu

మహిళలకు ప్రధాని మోదీ భారీ కానుక

December 21, 2021

06

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు భారీ కానుకను అందించారు. ఈ సందర్భంగా మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ప్రయాగ్ రాజ్ పవిత్ర గంగా, యుమన, సరస్వతీ నదుల సంగమ స్థలి అన్నారు. వేలాది సంవత్సరాల మన మాతృ శక్తికి ప్రతీకగా అభివర్ణించారు.

ఈనాడు ఈ పవిత్ర పట్టణం మహిళలు, వారి శక్తికి ప్రతీకగా నిలుస్తున్నట్టు పేర్కొన్నారు. అనంతరం రూ. 1.60 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల ఖాతాలకు రూ.1,000 కోట్లను బదిలీ చేశారు. లక్షకు పైగా మహిళా లబ్దిదారుల ఖాతాలకు వెయ్యి కోట్ల రూపాయలను బదిలీ చేయడం గర్వ కారణంగా ఉందన్నారు. కొంత కాలం క్రితం వరకు కనీసం బ్యాంకు ఖాతాలు కూడా లేని మహిళలు నేడు డిజిటల్ బ్యాంకింగ్ శక్తిని అందిపుచ్చుకుంటున్నారన్నారు. యావత్ దేశం యూపీ అభివృద్ధి వైపు చూస్తోందన్నారు. ఆడ శిశువులను గర్భంలో చంపేయకుండా కాపాడాలన్న లక్ష్యంతోనే భేటీబచావో.. భేటీ పడావో ప్రచారం ద్వారా సమాజంలో అవగాహనకు కృషి చేసినట్టు చెప్పారు.