టిక్‌టాక్‌కు ఘనంగా శ్రద్ధాంజలి..  - MicTv.in - Telugu News
mictv telugu

టిక్‌టాక్‌కు ఘనంగా శ్రద్ధాంజలి.. 

June 30, 2020

RIP TikTok: Nia Sharma, Kamya Panjabi and others celebrate ban of Chinese apps, Twitter flooded with memes

‌టిక్‌‌టాక్‌కు మనవాళ్లలో ఎక్కువమంది బానిసలు అయ్యారనే చెప్పాలి. పొద్దున లేచిన దగ్గర్నుంచి అందులోనే మఠం వేసుకుని కూర్చుంటున్నారు. దగ్గినా, పిత్తినా వరుస వీడియోలు చేస్తూ తెగ సంబర పడిపోయారు. ఇందుకు భిన్నంగా కొందరు తమ ప్రతిభను ప్రదర్శించుకుని మంచి వీడియోలు చేశారు. మరికొందరైతే టిక్‌టాక్‌లో ఫేమ్ సంపాదించుకున్నామని సెలబ్రిటీ అన్న పదానికి అర్ధాన్నే మార్చేశారు. వారిని తీసుకువచ్చి కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు టిక్‌టాక్ స్టార్లు అని బిరుదులు ఇచ్చి ఇంటర్వ్యూలు చేశాయి. వీడియోలు చేయడమే పనిగా పెట్టుకుని, అదో వ్యసనంలా మార్చుకున్నారు. కొందరు స్టార్లకు డూపులుగా వచ్చారు.. మరికొందరు అర్థనగ్న ప్రదర్శనలతో అతి చేశారు. మగవాళ్లు ఆడవాళ్లుగా వెకిలి వేషాలు వేసి వెగటు పుట్టించారు. ఇలా ఎందరో ఆశల మీద నీళ్లు ఝల్లుతూ కేంద్రం టిక్‌టాక్‌ను నిషేధించింది. దీంతో వారందరికీ ఊహించని షాక్ తగిలింది. అయితే ఈ టిక్‌టాక్ గోల భరించనివారు మాత్రం కేంద్రం మంచిపని చేసిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. రకరకాల మీమ్స్ పంచుకుంటున్నారు.

మహమ్మారి ఎందరి కాపురాల్లోనో చిచ్చు పెట్టిందని.. దాని జిమ్మడపోయిందని ఎగిరి గంతేస్తున్నారు.  ‘పోయే.. పోయే.. టిక్‌టాక్ పోయే.. ఉందిగా మంచి కాలం ముందుముదునా’ అంటూ కొంద‌రు న‌వ్వుతూ సంబరాలు చేసుకుంటున్నారు. క‌ష్ట‌ప‌డి వీడియోలు చేస్తూ లైకుల కోసం దిగాలు చెందినవారికి ఇక ఆ దిగులు లేదని అంటున్నారు. టిక్‌టాక్‌తో స‌హా 58 యాప్‌ల‌పై ప్ర‌భుత్వం నిషేధించ‌డాన్ని వీరు స్వాగ‌తిస్తున్నారు. న‌టి నియాశ‌ర్మ స్పందిస్తూ ‘ఈ దేశాన్ని ర‌క్షించినందుకు ధ‌న్య‌వాదాలు. టిక్‌టాక్ అనే వైర‌స్‌ను ఇంకెప్ప‌టికీ అనుమ‌తించ‌కండి’ అని కోరింది. ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం సంతోషాన్ని ఇచ్చింద‌ని న‌టుడు క‌ర‌న్‌వీర్ బోరా ఆనందం వ్యక్తం చేశారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తన టిక్‌టాక్‌ అకౌంట్‌ను తొల‌గించిన‌ట్లు వెల్ల‌డించారు. అయితే దానికి దాసోహం అయినవారి దుఖ్ఖం మాత్రం వర్ణణాతీతంగా ఉంది. ఏడుపులు పెడబొబ్బలతో టిక్‌టాక్‌కు వీడ్కోలు చెబుతున్నారు. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది? కొందరైతే ఇళ్లల్లో ఒంటరిగా ఉంటున్నాం.. టిక్‌టాక్ పుణ్యామా అని ఒంటరితనాన్ని జయిస్తున్నామని చెప్పినవారు ఉన్నారు. మరి వాళ్లు ఇప్పుడు ఎలా టైంపాస్ చేస్తారనేది ప్రశ్నే?