RIP TWitter trends Amid Mass Resignations
mictv telugu

మస్క్‌కు ఝలక్..ట్రెండింగ్‌లో ‘RIP Twitter’

November 18, 2022

కొత్త సీఈవో వచ్చారు. డైలీ క్లాసులు పీకుతున్నారు.ఉద్యోగాలు ఊస్టింగ్ మొదలెట్టారు.ఎక్కువ పనిగంటలు చేయాలని ఆర్డేశారు. ఉచిత భోజనంతో పాటు అన్న కట్ చేశారు. అయినా ఉద్యోగులు భరిస్తూ వచ్చారు.కొత్త సీఈఓ కదా..మార్పులు సహజం..సంస్థ బాగుకోసం భరించాల్సిందేనని సర్దుకుపోయారు. ఇదంతా ట్విట్టర్ ఉద్యోగులు గురించి..ఖర్చుల తగ్గింపు పేరిట ఈ టార్చర్ ఎక్కువైంది. అంతే ఉద్యోగులు ఎలాన్ మస్క్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. అసలు ట్విట్టర్లో ఏం జరగుతోంది? భారం తగ్గింపు పేరుతో ఎలాన్ మస్క్ నరకం చూపిస్తున్నారా?ఉద్యోగుల సామూహిక రాజీనామాలతో ఏం జరగబోతోంది?

ట్విట్టర్‌లో ఏం జరుగుతోంది?

ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ చిక్కాక ఉద్యోగులు పిట్టల్లా గిలగిలకొట్టుకుంటున్నారు. ఎప్పుడు ఊస్టింగ్ ఆర్డర్ వస్తుందోనని టెన్షన్ పడుతున్నారు. దీనికితోడు ఎలాన్ మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆందోళన పరుస్తున్నాయి. సడెన్‌గా ఉద్యోగం మానేయలేరు.కొత్త ఉద్యోగం చూసుకోవాలంటే టైమ్ పడుతుంది. ఈలోగా ఈఎమ్ఐల పరిస్థితి ఏంటి? ఇదే ఆందోళన ట్విట్టర్ ఉద్యోగం వదిలి పెట్టకుండా ఉంచింది. ఎంత కఠిన నిర్ణయమైనా భరిస్తూ వచ్చారు. సంస్థ బాగుకోసమే అని తమలోతామే సర్ధిచెప్పుకుంటూ ఉద్యోగం మానేయలేదు. అసలే సాఫ్ట్‌వేర్ జాబ్..నిత్యం టెన్షనే. ఇందులో కొత్తగా మస్క్ మంటపుట్టిస్తున్నాడు. ఏం చేయాలో ఉద్యోగులకు అర్థం కాలేదు. ఇక లాభం లేదు అనుకున్నారు. ఒక్కసారిగా రాజీనామాలు చేశారు. మంట పెడుతున్న మస్క్‌కు మస్తు ఝలక్ ఇచ్చారు.

ట్రెండింగ్‌లో ‘RIP Twitter’

ఉద్యోగుల మాస్ రిసిగ్నేషన్స్ తో #’RIP Twitter’ట్రెండింగ్‌లోకి వచ్చింది. మస్క్ నిర్ణయాల్ని ఉద్యోగులే కాదు సోషల్ మీడియా తప్పుపడుతోంది. నువ్వు వద్దు..నీ జాబ్ వద్దురా బాబు అంటూ రాజీనామాలు ఇచ్చేస్తున్నారు. ఇప్పటిదాకా ఎంతమంది రాజీనామాలు చేసింది స్పష్టంగా తెలియడం లేదు. వందల సంఖ్యలోనే ఉంటారని ట్విట్టర్ ఉద్యోగులు చెబుతున్నారు. మీమ్స్ తో మస్క్ తీరుని ఎండగడుతున్నారు. ప్రతి ఒక్కరూ ట్వట్టర్ ఖేల్ ఖతమైందంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

అంతా గందరగోళం

ఎలాన్ మస్క్ ఈ మధ్యనే ట్విట్టర్ సీఈవో బాధ్యతలు తీసుకున్నారు. వచ్చీరాగానే భారీ మార్పులకు తెరతీశారు. ఉద్యోగులు ఎక్కువ గంటలకు పనిచేయాలని ఆదేశించారు. ఉచిత భోజనం, ఉద్యోగుల పనితీరుని బట్టి సంస్థ ఇచ్చే ప్రోత్సాహల్ని తగ్గింపు ఉంటుందన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండదని తేల్చిచెప్పారు. ట్విట్టర్ సంస్థ దివాలా తీసే పరిస్థితిలో ఉందని, ఉద్యోగుల్లో మార్పురాకపోతే తొలగించాల్సి ఉంటుందని మస్క్ హెచ్చరించారు. అన్నట్టే 3 వేలకుపైగా ఉద్యోగుల్ని తొలగించారు. మస్క్ అల్టిమేటంపై ఉద్యోగులు తిరగబడ్డారు. సామూహిక రాజీనామాలు చేయాలని నిర్ణయించారు.దీంతో సోమవారం దాకా ట్విట్టర్ కార్యాలయాల్ని సంస్థ మూసివేసింది.

తిండికి వందల కోట్లు..!

ట్విట్టర్ ఉద్యోగుల తిండికి వందల కోట్లు ఖర్చువుతుందని మస్క్ అంటున్నాడు. ఒక్క శాన్ ఫ్రాన్సిస్కో కార్యాలయంలోనే ఏడాది ఉచిత భోజన ఖర్చు వంద కోట్లు అవుతుందన్నారు. అందుకే ఇకపై ఉచితంగా అందించేది లేదని మస్క్ తెగేసి చెప్పారు. అయితే మస్క్ మాటల్లో నిజం లేదని మాజీ ఉద్యోగులు అంటున్నారు. భోజనానికి మస్క్ చెప్పేంత ఖర్చు కావడం లేదన్నారు.

సంస్థను వీడే యోచన

ట్విట్టర్‌ని వీడే యోచనలో చాలా ఉంది ఉద్యోగులు ఉన్నారు. టెన్షన్స్ భరిస్తూ ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముందంటున్నారు. మస్క్ నుంచి తప్పించుకోవాలంటే కఠిన నిర్ణయం తప్పదంటున్నారు.అందుకే సామూహిక రాజీనామాలకు తెరలేపారు.

మస్క్ ఏం చేస్తారో…

మస్క్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు ఉద్యోగులకు నచ్చడం లేదు. ఒకేసారి అన్నివైపుల నుంచి దాడి చేస్తే తట్టుకునేదెలా అని ప్రశ్నిస్తున్నారు. సంస్థ బాగుకోసం విడతలవారీగా నిర్ణయాలు ఉంటే మంచిందటున్నారు.ఈ మాటల్ని మస్క్ అసలు పట్టించుకోవడం లేదు..సంస్థను కొన్నామా.ఖర్చులు తగ్గించామా..లాభాల్లోకి తీసుకెళ్లామా అనేది మస్క్ ఆలోచిస్తున్నారు. ఏ సంస్థ అయినా కొన్న రెండు,మూడు నెలల్లోనే ఇన్ని భారీ మార్పులకు శ్రీకాకం చుట్టదు. ఆర్నెళ్లు స్టడీ చేసి మెల్లగా మెల్లగా నిర్ణయాలు తీసుకుంటూ సంస్థను గట్టెక్కిస్తుంది. ఇందుకు మస్క్ పూర్తి విరుద్దం. వచ్చీరాగానే అద్భుతాలు చేయాలనుకుంటున్నారు.కానీ మొదటికే మోసం వచ్చేలా ఉంది.