ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న సమయంలో కారు ప్రమాదానికి గురైన కికెటర్ రిషబ్ పంత్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ విషయాన్ని నేషనల్ క్రికెట్ అకాడమీ(nca) డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ తెలిపారు. పంత్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన ట్వీట్ చేశారు.‘దేవుడి దయతో పంత్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. పంత్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా, గెట్ వెల్ సూన్ ఛాంప్’ అని ట్వీట్ చేశారు. పంత్ త్వరగా కోలుకోవాలని అతడి అభిమానులు దేవునిని ప్రార్థిస్తున్నారు. వైద్యుల సూచన మేరకు పంత్‌ను ప్రస్తుతం ఢిల్లీ తరలించి చికిత్స అందిస్తున్నారు.
Praying for Rishabh Pant. Thankfully he is out of danger. Wishing @RishabhPant17 a very speedy recovery. Get well soon Champ.
— VVS Laxman (@VVSLaxman281) December 30, 2022
శుక్రవారం ఉదయం రిషబ్ పంత్ బీఎండబ్ల్యూ కారు ప్రమాదానికి గురైంది.ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌కు తిరిగి వస్తుండగా.. హమ్మద్‌పూర్ ఝల్ సమీపంలో అతని కారు డివైడర్‌ను ఢీకొట్టి మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో పంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తల, వీపుపై బలమైన గాయాలు అయ్యాయి. పంత్ కాలుకు కూడా ఫాక్చర్ అయింది. ప్రస్తుతం పంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. రిషబ్ కారు మొదట రెయిలింగ్‌ను ఢీకొట్టింది, ఆ తర్వాత కారులో మంటలు చెలరేగాయి. వెంటనే కారు నుంచి పంత్ బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద దృశ్యాలు భయానకంగా కనిపిస్తున్నాయి.