rishab shetty fight with rashmika exposed again
mictv telugu

మళ్ళీ రచ్చకెక్కిన వివాదం.. రష్మికపై రిషబ్ శెట్టి సంచలన ఆరోపణలు

November 22, 2022

కాంతార భారీ విజయం తర్వాత రిషబ్ శెట్టి ఇంటర్వ్యూలు భారతదేశ నలుమూలల వైరల్ అవుతున్నాయి. జాతీయ మీడియా సైతం రిషబ్ పై భారీ ఆసక్తి చూపేడుతుంది. ఈ నేపథ్యంలో నేషనల్ క్రష్ రష్మికపై ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ మరింత వైరల్ అవుతున్నాయి. రష్మిక పేరెత్తగానే రిషబ్ శెట్టి చేసిన సైగలు వారిద్దరి మధ్య గొడవలను రుజువు చేస్తున్నాయి. కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమాతో రష్మికని ఇంట్రడ్యూస్ చేసింది రిషబ్ శెట్టినే. రిషబ్ దర్శకత్వంలో సినీ ఎంట్రీ ఇచ్చి.. అప్పట్లో ఒకసారి అతనిని తీసి పారేసినట్టు రష్మిక మాట్లాడటంతో గొడవ స్టార్ట్ అయింది. ఒక కవర్ పేజీపై కిరిక్ పార్టీ పోస్టర్ చూసి.. ‘ఆ ఎదో తోలి అవకాశం ఇచ్చాడులే’ అన్నట్టు గౌరవం ఇవ్వకుండా రిషబ్ శెట్టి గురించి అప్పట్లో రష్మిక చేసిన కామెంట్స్ వివాదాస్పదం అవుతే.. కాంతార ఇంకా చూడలేదని రష్మిక చెప్పటం గోడవలని తారాస్థాయికి చేర్చింది. కన్నడ అమ్మాయిగా.. కన్నడ ప్రజల ఆశీర్వాదంతో పాన్ ఇండియా స్థాయికి ఎదిగి.. ఇప్పుడు బ్లాక్ బస్టర్ అయిన కాంతార చూడలేదని చులకన చేస్తుందా.. అంటూ కన్నడిగులు రష్మికపై మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలో కాంతార హీరో రిషబ్ శెట్టి సైతం రష్మికపై తన అభిప్రాయాన్ని చెప్పేశాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో.. రష్మిక, సమంత, సాయి పల్లవిలలో తన తదుపరి చిత్రం కోసం ఎవరితో కలిసి పని చేయాలనుకుంటున్నారు అనే ప్రశ్నకు సమాధానమిస్తూ రిషబ్ శెట్టి స్పందించాడు. “నేను కొన్ని రకాల నటీమణులతో కలిసి పనిచేయాలని అనుకోవడం లేదు.. అయితే, మీరు ఇచ్చిన లిస్ట్‌లో సాయిపల్లవి, సమంతల పనితనం నాకు బాగా నచ్చింది” అంటూ వ్యంగ్యంగా స్పందించాడు రిషబ్. దాంతో మరి రష్మికతో చేయరా అని యాంకర్ అడుగుతే.. దండం పెట్టి ఇక ఆపాలంటూ యాంకర్ కి సైగలు చేస్తాడు రిషబ్ శెట్టి. తనని ఎన్నోసార్లు అవమానించిన రష్మికకి కౌంటర్ గానే రిషబ్ ఇలా ప్రవర్తించాడని అంటున్నారు నెటిజన్. అసలే సొంత బాషా కన్నడ సినిమాను రష్మిక లెక్క చేయడం లేదని కామెంట్స్ వస్తున్న తరుణంలో అమేకు కౌంటర్ ఇచ్చేలా రిషబ్ రియాక్ట్ కావడంతో రష్మికపై ట్రోల్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే తనను వేధించొద్దంటూ ట్రోలర్స్ కి బహిరంగ లేఖ రాసింది రష్మిక. అప్పటి నుండి ట్రోలింగ్ కాస్త తగ్గినా.. మళ్ళీ రిషబ్ వ్యాఖ్యలతో రష్మికపై భారీ ట్రోలింగ్ స్టార్ట్ అయిపోయింది.