బాలీవుడ్ హీరోయిన్‌ను వాట్సాప్‌లో బ్లాక్‌ చేసిన పంత్‌ - MicTv.in - Telugu News
mictv telugu

బాలీవుడ్ హీరోయిన్‌ను వాట్సాప్‌లో బ్లాక్‌ చేసిన పంత్‌

January 12, 2020

lgjlg

క్రికెటర్లు, బాలీవుడ్‌ హీరోయిన్‌ల ప్రేమ వ్యవహారాలపై ఎప్పుడూ రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. కోహ్లీ-అనుష్క, జహీర్‌-సాగరిక, హర్భజన్‌-గీతా, యువీ-హజెల్‌ వంటివారు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా యువ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతెలా వాట్సప్‌ నంబర్‌ను బ్లాక్‌ చేశాడట. వీరిద్దరూ గతంలో పార్టీలకు కలిసిన వెళ్లిన సందర్భాలు ఉన్నాయి.

ప్రస్తుతం రిషభ్‌ పంత్ ఇషా నేగీతో ప్రేమలో ఉన్నాడు. ఆమెతో జీవితం పంచుకోవాలని కోరుకుంటున్నాడు. జనవరి 1న ఇంస్టాగ్రామ్‌లో ఇషాతో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. ‘నీతో కలిసున్నప్పుడు నన్ను నేను మరింత ఇష్టపడతా’ అని క్యాప్షన్ కూడా పెట్టాడు. అయితే ఇటీవల పంత్‌తో టచ్‌లోకి వచ్చేందుకు ఊర్వశి చాలాసార్లు ప్రయత్నించిందట. కానీ, పంత్ ఆమెతో మాట్లాడడానికి ఇష్టపడలేదట. పదేపదే విసిగిస్తుందనుకున్నాడో ఏమో ఆమె నంబర్‌ను వాట్సాప్‌లో బ్లాక్‌ చేశాడని వార్తలు వస్తున్నాయి. వారిద్దరూ పరస్పరం చర్చించుకున్నాకే నంబర్లు బ్లాక్‌ చేసుకున్నారని ఊరశ్వి సన్నిహితుడు చెప్పినట్టు సమాచారం.