కపిల్ రికార్డును చెరిపేసిన రిషభ్ పంత్ - MicTv.in - Telugu News
mictv telugu

కపిల్ రికార్డును చెరిపేసిన రిషభ్ పంత్

March 14, 2022

cc

టీమిండియా వికెట్ కీపర్ – బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ 40 ఏళ్ల రికార్డును చెరిపేశాడు. భారత్ తరపున టెస్టుల్లో వేగవంతమైన అర్ధ సెంచరీ చేసిన ఆటగాడిగా కపిల్ దేవ్‌ను అధిగమించాడు. బెంగళూరులో శ్రీలంకతో జరుగుతున్న రెండో డే/నైట్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పంత్ 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. 1982లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కపిల్ దేవ్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా, ఇప్పటివరకు ఈ రికార్డు అలాగే ఉండిపోయింది. తాజాగా రిషభ్ తన పేరు లిఖించుకున్నాడు. ఓవరాల్‌గా పాక్ ఆటగాడు మిస్బా ఉల్ హక్ 21 బంతుల్లో 50 పరుగులు చేసి మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక, శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ విజయం దిశగా అడుగులు వేస్తోంది. 447 పరుగుల టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక ప్రస్తుతం ఒక వికెట్ కోల్పోయి 28 పరుగులు చేసింది. ఇంకా మూడు రోజులు ఉన్న నేపథ్యంలో లంక ఆటగాళ్లు లక్ష్యాన్ని ఛేదిస్తారా? లేక ఆలౌటవుతారా అనేది చూడాల్సి వుంది.