పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ టీమిండియా ఆటగాడు రిషభ్ పంత్‌కు కోట్లు సంపాదించే ఐడియా చెప్పాడు. కాస్త బరువు తగ్గితే మోడల్‌గా కోట్లు సంపాదించే అవకాశాలున్నాయని సలహా ఇచ్చాడు. ఇటీవల ఇంగ్లండుతో జరిగిన వన్డే సిరీస్ గెలుపులో కీలక పాత్ర పోషించిన రిషభ్ పంత్‌పై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. ఏమాత్రం భయం లేకుండా క్రికెట్ ఆడే పంత్ అమ్ముల పొదిలో కట్ షాట్, పుల్ షాట్, రివర్స్ స్వీప్, స్లాగ్ స్వీప్, ప్యాడిల్ స్వీప్ వంటి వైవిధ్యభరితమైన షాట్లు ఉన్నాయని కొనియాడారు. ఆ టెక్నిక్స్‌తోనే ఒంటి చేత్తో సిరీస్‌ను గెలిపించాడని వెల్లడించారు. అయితే పంత్ కాస్త అధిక బరువుతో కనిపిస్తున్నాడని, కాస్త బరువు తగ్గితే భారీగా ఉన్న ఇండియన్ మార్కెట్లో కోట్లు సంపాదించే అవకాశాలున్నాయని పేర్కొన్నాడు. ఇండియాలో ఎవరైనా సూపర్ స్టార్ అయితే కంపెనీలు భారీ పెట్టుబడులు పెడతాయని, ఆ విధంగా పంత్ ముందు మంచి అవకాశం ఉందని వివరించాడు. మరి ఈ సలహాను పంత్ పాటిస్తాడో లేదో చూడాలి.