Rishabh Pant countered bollywood heroin Urvashi Rautela
mictv telugu

ప్లీజ్ అక్కా నన్ను వదిలేయ్ – హీరోయిన్‌కు గట్టి కౌంటరిచ్చిన పంత్

August 11, 2022

మన దేశంలో బాలీవుడ్, క్రికెటర్ల మధ్య అవినాభావ సంబంధం ఉంది. గతంలో ఎంతో మంది క్రికెట్లర్లు బాలీవుడ్ హీరోయిన్లను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. విరాట్ కోహ్లీ, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, రవిశాస్త్రి వంటి వారు ఈ కోవకు చెందిన వారే. అదే సమయంలో తమ పేరు ప్రఖ్యాతుల కోసం కొంత మంది హీరోయిన్లు ప్రముఖ క్రికెటర్ల పేర్లను వాడుకుంటూ ఉంటారు. తాజాగా బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా – రిషభ్ పంత్ వ్యవహారం ఈ అంశాన్ని గుర్తు చేస్తోంది.

వివరాల్లోకెళితే.. వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని గతంలో కథనాలు వచ్చాయి. ఆ పుకార్లకు అనుకూలంగా ఊర్వశి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘నన్ను ఓ వ్యక్తి ప్రేమిస్తున్నాడు. నన్ను కలవడానికి పడి చస్తున్నాడు. గతంలో నేను వారణాసిలో షూటింగ్ ముగించి ఓ షో కోసం ఢిల్లీ వెళ్లాను. అక్కడ పది గంటల పాటు షూటింగ్ జరిగింది. తర్వాత బాగా అలసిపోవడంతో ఇంటికెళ్తుండగా, అక్కడ ఓ వ్యక్తి నా కోసం లాబీలో ఎదురు చూస్తున్నాడని తెలిసింది. అతని కోసం రెడీ అవ్వాలనుకున్నా కానీ, బాగా అలసిపోవడంతో వెంటనే నిద్ర పట్టేసింది. తర్వాత లేచి చూస్తే ఫోన్‌లో 16-17 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అతని పేరు చెప్పను కానీ, షార్ట్ కట్లో rp’ అని వెల్లడించింది. దీంతో అంతా రిషభ్ పంత్ అనే అనుకున్నారు. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలపై రిషభ్ పంత్ స్పందించాడు. ఎక్కడా ఊర్వశి పేరు ప్రస్తావించకుండా దిమ్మతిరిగే కౌంటరిచ్చాడు. ‘కొంత మంది తమ పేరు పాపులర్ అవడం కోసం దిగజారడానికైనా సిద్ధంగా ఉంటారు. తమ ప్రయోజనాల కోసం మరో వ్యక్తిని ఇబ్బందుల్లో పడేస్తారు. ఇది చాలా ఫన్నీగా ఉంటుంద’ని చెప్పి చివరగా ‘ప్లీజ్ అక్కా, నన్ను వదిలేయ్, అబద్దాలడడానికైనా ఓ లిమిట్ ఉంటుంది’ అని క్యాప్షన్ జత చేశాడు. మరి పంత్ వ్యాఖ్యలపై ఊర్వశి ఎలా స్పందిస్తుందో చూడాలి.