హోటల్‌లో క్రికెట్ ప్రాక్టీస్ - MicTv.in - Telugu News
mictv telugu

హోటల్‌లో క్రికెట్ ప్రాక్టీస్

August 11, 2019

టీం ఇండియా క్రికెటర్లు విండీస్ టూర్‌లో డిఫరెంట్‌గా ప్రాక్టీస్ చేశారు. హోటల్ రూంలోనే ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. రిషబ్ పంత్, కుల్‌దీప్ ఇద్దరూ కలిసి కారిడార్‌లో మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేశారు. దీన్ని రిషబ్ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్టు చేశారు. దీంతో అభిమానులు తెగ లైకులు కొట్టేస్తున్నారు. 

విండీస్‌తో వన్డే సిరీస్ జరుగుతోంది. అయితే అక్కడ వర్షాల కారణంగా తొలి వన్డే కాస్త రద్దు అయింది. రెండో వన్డే ఆడేందుకు పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌కు వెళ్లారు. అక్కడ మ్యాచ్‌కు ముందు రోజు వర్షం పడటంతో ప్రాక్టీస్ చేసే అవకాశం దొరకలేదు. దీంతో హోటల్ కారిడార్‌లోనే రిషబ్ గ్లౌజ్ పెట్టుకొని కీపింగ్ చేస్తుండగా లెగ్ స్పిన్నర్ కుల్దీప్ బౌలింగ్ వేస్తూ కనిపించాడు. దీన్ని రిషబ్ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్టు చేశారు.