Rishabh Pant failed once again IN T20s
mictv telugu

ఈసారీ పంత్ పాయే..

November 22, 2022

భారత్ ఆశాకిరణంగా భావిస్తున్న రిషబ్ పంత్ టీ20ల్లో తన వైఫాల్యాన్ని కొనసాగిస్తున్నాడు. న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌లో ఓపెనర్‌గా అవకాశమిచ్చిన రాణించలేక ఇబ్బంది పడుతున్నాడు. రెండో టీ20లో ఆరుపరుగులకే వెనుదిరిగిన పంత్..మూడో టీ20లోనూ దారణంగా విఫలమయ్యాడు. కేవలం 11 పరుగులే చేసి పెవిలియన్‌కు చేరాడు. దీంతో మరోసారి పంత్ బ్యాటింగ్‌పై చర్చ మొదలైంది. గత మ్యాచ్ లో విఫలమైన పంత్‌ను తప్పించి సంజూ శాంసన్‌కు అవకాశం కల్పించాలని డిమాండ్‌లు వ్యక్తమయ్యాయి. వరుస విఫలమవుతున్న పంత్‌కు అధిక అవకాశాలు కల్పిస్తున్నారని తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఓపెనర్‌గా ఒక్క మ్యాచ్‌తో పక్కనపెట్టడం సరికాదనే అభిప్రాయంతో మూడో టీ20లో అవకాశాన్ని ఇచ్చింది మేనేజ్‌మెంట్. ఈ మ్యాచ్‌లో విఫలం కావడంతో నెటిజన్లు పంత్‌ను తిటిపారేస్తున్నారు. అతనిని పక్కనబెట్టి సంజూ శాంసన్‌కు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.