Rishabh Pant HOSPITALISED after major accident near Roorkee
mictv telugu

బిగ్ బ్రేకింగ్..క్రికెటర్ రిషబ్ పంత్‎కు రోడ్డు ప్రమాదం..తీవ్ర గాయాలు

December 30, 2022

టీం ఇండియా ఆటగాడు రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. పంత్ కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో పంత్‎కు తీవ్రగాయాలు కావడంతో పాటు కారు పూర్తిగా దగ్థమైంది. అతనిని మొదట స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించారు. అనంతరం ఢిల్లీకి తరలించారు. ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్తుండగా రూర్కీ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో పంతే స్వయంగా కారు నడుపుతున్నట్లు సమాచారం.ఇంకా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.