ప్చ్..సెంచరీ ముంగిట రిషబ్ పంత్, శ్రేయస్ ఔట్..భారత్ వరుస వికెట్లు
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ ఆటగాడు రిషబ్ పంత్ తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. 105 బంతుల్లో 93 పరుగులు చేసి మెహదీ హసన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ప్రస్తుతం భారత్ 73 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. 100లోపే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న బారత్‌ను పంత్ -శ్రేయస్ అయ్యర్ ఆదుకున్నారు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ జోడి ఐదో వికెట్ కు 159 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ప్రధానంగా పంత్ బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. సిక్సర్లతో బంగ్లాకు గుబులు పుట్టించాడు. అతని ఇన్నింగ్స్ లో ఏడు ఫోర్లతో పాటు ఐదు సిక్సర్లు ఉన్నాయి. అంతకుముందు భారత్ టాప్ ఆర్డర్ విఫలమయ్యింది. 94 పరుగులకే నలుగురు కీలక బ్యాట్స్ మెన్లు ఔటయ్యారు. కేల్ రాహుల్ 10, గిల్ 20, పుజారా 24, విరాట్ కోహ్లీ 24 పరుగులు చేసి తొందరగానే పెవిలియన్‌కు చేరారు. పంత్ ఔటయ్యాక అక్షర్ పటేల్(4) వచ్చిన వెంటనే వెనుదిరిగాడు. అనంతరం శ్రేయస్ అయ్యర్ (87)కూడా సెంచరీ ముందు పెవిలియన్ కు చేరాడు. ప్రస్తుతం అశ్విన్ (4), ఉనద్కత్ క్రీజ్‌లో ఉన్నారు.