టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ గత నెల 30వ తేదీని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.అతడు ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాద సమయంలో పంత్ కారు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడిన పంత్ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. రిషబ్ తల, వీపు, కాలు, మోకాలు మరియు లిగమెంట్‌పై తీవ్ర గాయాలయ్యాయి. ఇక అంతకు ముందు పంత్ డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో పంత్ చికిత్స అందుకున్నాడు. ఆ తరువాత భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పంత్‌ను విమానంలో తరలించి ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేర్పించింది. అక్కడ రెండు రోజుల కిందట పంత్ కుడి కాలు మోకాలి లిగమెంట్‌కు శస్త్రచికిత్స చేశారు. ఈ ఆపరేషన్ తర్వాత, స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ పంత్ స్పందన బాగుందని అంటున్నారు వైద్యులు. ఏదేమైనా అతడు క్రికెట్ ఆడేందుకు సుమారు 6 నుంచి ఏడు నెలలు పట్టే అవకాశం ఉంది. పంత్ ఆరోగ్య పరిస్థితిపై పూర్తి శ్రద్ధ తీసుకుంటున్న బీసీసీఐ..మరో విషయంలో అండగా నిలిచింది.
పంత్ విషయంలో తాజాగా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అతడికి ఓ శుభవార్త అందించింది. ప్రమాదం కారణంగా పంత్ క్రికెట్‌కు దూరమైనా అతడికి మొత్తం జీతాన్ని ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. ప్రస్తుతం పంత్ ఏ కేటగిరీలో ఉన్నాడు. బీసీసీఐ రూల్స్ ప్రకారం ప్రతి ఏటా పంత్‌కు రూ.5 కోట్లు అందనుంది. ఇప్పుడు పంత్ కొన్ని నెలల పాటు క్రికెట్‌కు దూరమైనా అతడికి ఫుల్ సాలరీ బీసీసీఐ అందివ్వనుంది. మరోవైపు ఐపీఎల్ కూడా దూరం కావడంతో ఆ సాలరీ కూడా ఇవ్వాలని ఢిల్లీ క్యాపిటల్స్‌ను బీసీసీఐ ఆదేశించింది. ఇందుకు గాను పంత్ ఢిల్లీ ప్రాంఛైజీ నుంచి రూ.16 కోట్లు అందుతుంది.