టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఇంగ్లాండుతో జరుగుతున్న ఐదో టెస్టులో తిరిగి ఫామ్ అందుకున్న విషయం తెలిసిందే. మొదటి ఇన్నింగ్సులో సెంచరీ, రెండో ఇన్నింగ్సులో హాఫ్ సెంచరీ చేసిన పంత్.. ఇంగ్లాండ్ గడ్డపై 72 ఏళ్ల రికార్డును చెరిపేశాడు. ఒకే టెస్టులో ఎక్కువ పరుగులు (203) చేసిన వికెట్ కీపర్‌గా రికార్డు సాధించాడు. ఇదే క్రమంలో ధోనీ రికార్డును సైతం పంత్ బద్ధలు కొట్టాడు. ధోనీ 2011లో రెండు ఇన్నింగ్సులలో కలిపి 151 పరుగులు చేశాడు. ఇదే ఊపులో ఒకే టెస్టులో సెంచరీ, హాఫ్ సెంచరీ చేసి 1973లో ఫరూక్ ఇంజనీర్ తర్వాత రెండో వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఈ విధంగా ఒకే మ్యాచులో మూడు రికార్డులను సాధించాడు పంత్.