టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ రిషబ్ పంత్కు పెద్ద ఊరట. అతని మోకాలి ఆపరేషన్ సక్సెస్ అయింది. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో ఈ సర్జరీ పూర్తి చేశారు. అతడు వేగంగా కోలుకుంటున్నాడు. మోకాలి లిగమెంట్ తెగిపోవడంతో శుక్రవారం సర్జరీ చేశారని, ఇది విజయవంతమైందని బీసీసీఐ తెలిపింది. పంత్ గత నెలలో ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్తూ పెద్ద ప్రమాదానికి గురయ్యాడు. అతని కారు డివైడర్ను ఢీకొట్టి మంటల్లో చిక్కుకుంది. హరియాణా ఆర్టీసీ ఉద్యోగులు అతణ్ని కాపాపాడు. మొదట డెహ్రాడూన్లో చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ముంబైకి తరలించారు. దెబ్బలు బలంగా తలగలడంతో పంత్ కోలుకోవడానికి ఆరేడు నెలలు పట్టొచ్చని వైద్యుల అంచనా. దీంతో ఈ ఏడాది అతడు క్రికెట్ ఆడడం అనుమానంగానే ఉంది. పంత్ ముఖానికి కూడా తీవ్ర గాయాలు కావడంతో ప్లాస్టిక్ సర్జరీ కూడా చేశారు.