Rishabh Shetty appealed to the audience over kanthara
mictv telugu

దయచేసి అలా చేసి కించపర్చవద్దు.. రిషబ్ షెట్టి

October 21, 2022

చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన కాంతార చిత్రం దేశం దృష్టిని ఆకర్షించింది. అనేక భాషల్లో విడుదలై మంచి కలెక్షన్లు రాబడుతోంది. కర్ణాటకలోని తుళునాడు ప్రాంతంలోని ఆచారాలను ఆధారంగా చేసుకొని చిత్రాన్ని తెరకెక్కించారు. దేవుణ్ణి ఆరాధించే భూతకోల సంస్కృతిని తెలియజేశారు. ఇక దేవుడు ఆవహించే సమయంలో కోల ఆడే వ్యక్తులు చేసే వింత శబ్దం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఆ ధ్వని వినిపించిన ప్రతీసారి ప్రేక్షకులు థియేటర్లు దద్దరిల్లిపోయేలా హంగామా చేస్తున్నారు. కొందరైతే థియేటర్లోనే అరుస్తున్నారు. ఇక సినిమా చూసి బయటికి వచ్చిన తర్వాత కూడా చాలా మంది ఆ శబ్దాన్ని అనుకరిస్తూ తమ అభిమానాన్ని చాటిచెప్తున్నారు. ఈ విషయం హీరో కం దర్శకుడు రిషబ్ షెట్టి దృష్టికి వచ్చింది. దీంతో ఆయన స్పందించి ప్రేక్షకులకు ఓ విన్నపం చేశారు. ‘ఓ.. అనేది కేవలం ఓ శబ్దం మాత్రమే కాదు. అది మాకు సెంటిమెంట్. దాన్ని అనుకరించవద్దు. ఇదొక ఆచారం. ఆధ్యాత్మిక నమ్మకం. అలాగే చాలా సున్నితమైన అంశం. దీనివల్ల ఆచారం దెబ్బతినవద్దు’ అంటూ ప్రేక్షకులకు రిక్వెస్ట్ చేశాడు.