రుషి అంత్యక్రియలో అలియా ప్రవర్తన బాగాలేదా? ఏది నిజం?
సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మాలా వద్దా? వార్తను బట్టి, ఎవరు దాన్ని బయటికి తెచ్చారన్నదాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. అయితే ఫొటోలు, వీడియోల రూపంలో వచ్చే వార్తలను జనం సులభంగా నమ్మేస్తుంటారు. బాలీవుడ్ నటి అలియా భట్ పై తాజాగా సాగుతున్న ట్రోలింగ్‌కు అదే కారణమైంది. ఆమె తన బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ తండ్రి రుషి కపూర్ అంత్యక్రియల్లో అనుచితంగా ప్రవర్తించిందటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. సెల్ ఫోన్‌తో ఆమె అక్కడి దృశ్యాలను షూట్ చేస్తున్నట్లు ఫొటోలు ఉండడమే కారణం. అయితే ఆమె ఏడుపు ముఖంతోనూ కనిపించడంతో కొందరు కూపీ లాగి అసలు సంగతి బయటపెట్టారు.
నిజానికి అలియా అక్కడి దృశ్యాన్ని ఉద్దేశపూర్వకంగా వీడియో తీయడం లేదు. రుషి కపూర్ అంత్యక్రియల కోసం ఢిల్లీ నుంచి రోడ్డు మార్గంలో వస్తున్న ఆయన కూతురు రిద్దిమాకు అంత్యక్రియలను దృశ్యాన్ని ఆన్ లైన్లో చూపుతోంది. మధ్యమధ్యలో రిద్దిమాతో మాట్లాడుతోంది. అయితే ఈ విషయం బయటికి కనిపించకపోవడంతో, అలియా కావాలని వీడియో రికార్డు చేస్తున్నట్లు బయటికి వారికి కనిపించంతో ట్రోలింగ్ సాగుతోంది. 1400 కి.మీ దూరం ప్రయాణించిన రిద్దమి అంత్యక్రియలు ముగిశాక ముంబై చేరుకుంది.