ఎరక్కపోయి ఇరుక్కున్న రుషి కపూర్ ! - MicTv.in - Telugu News
mictv telugu

ఎరక్కపోయి ఇరుక్కున్న రుషి కపూర్ !

August 28, 2017

సోషల్ మీడియా అంటే పూర్తి స్వేచ్ఛ వుంటుంది. మనకు నచ్చిన పోస్టులు పెట్టుకోవచ్చు, నచ్చిన ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ చేస్కోవచ్చు అనుకుంటుంటారు చాలా మంది. కానీ అందులో కూడా సమస్యలు ఎదురౌతాయని తాజాగా బాలీవుడ్ నటుడు రుషి కపూర్ విషయంలో రుజువైంది. ఆయన మీద ఏకంగా కేసే నమోదైంది. ఇంతకీ అతను ఏం షేర్ చేశాడో తెల్సా ? తనకు ట్విట్టర్లో 26 లక్షల పైగా ఫాలోవర్లున్నారు. ఎప్పుడూ ట్విట్టర్లో చాలా ఆక్టివ్ గా వుంటాడు రుషి కపూర్. అయితే రుషి కపూర్ షేర్ చేసిన ఆ వీడియో ఏంటి ? ఆ వీడియోలో వున్నదేంటి ? ఎరక్కపోయి ఇరుక్కున్న ఈయన వ్యవహారం ఏంటో మీరూ ఓ లుక్కేయండి.

వీడియోలో.. ఒక ఏటిఎమ్ సెంటర్లో మనీ డ్రా చేస్తున్న మహిళ వెనకాల ఒక పదేళ్ళ బాబు వుంటాడు. అప్పుడే అక్కడికొక యువకుడు వస్తాడు. ఆ బాబు చిలిపిగా ఆమె బ్యాక్ మీద కొడతాడు.  ఆమె వెనక్కి తిరిగి ఆ యువకుడే తనను కెలికాడని లాగిపెట్టి అతని చెంప వాయిస్తుంది. అలా రెండుసార్లు అతని చెంప వాయగొట్టిస్తాడా బాబు. ఇదీ స్థూలంగా ఆ వీడియోలో వున్నది.

 

చాలా ఫన్నీగా వుందనుకొని పాపం రుషి కపూర్ షేర్ చేసినట్టున్నాడు. అంతే జయహో ఫౌండేషన్ అధ్యక్షుడు అఫ్రోజ్ మలిక్ అతని ట్విట్టర్ వాల్ మీద ఆ వీడియోను చూసాడు. వెంటనే రుషి కపూర్ మీద కోర్టులో కేసు వేసాడు. అతని వాదనేంటంటే ఒక సెలెబ్రిటీ హోదాలో వుండి ఇలాంటి వీడియోలు షేర్ చేసి ఉద్ధరించేదేంటని ప్రశ్నిస్తున్నాడు ? పిల్లలను అలా పోకిరీలుగా, నేరస్థులుగా అస్సలు చూపించకూడదు కదా అంటున్నాడు.

 

చదివారు కదా.. ఇక నుంచి మీరు కూడా సోషల్ మీడియాలో ఫన్నీగా వుందని ఏది పడితే అది షేర్ చెయ్యకండి. అలాగే ఇష్టమొచ్చిన రాతలు కూడా రాయకూడదు సుమా. ఎందుకంటారా.. ఆ నడుమ  టీడీపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో రాస్తున్నవాళ్ళ మీద ఆంధ్రా ప్రభుత్వం చర్యలు తీస్కుంది. సో తస్మాత్ జాగ్రత్త సోషల్ మీడియా హల్ చల్ వాలాలు !