సాయంత్రమైనా వైన్స్ తెరవండి.. నటుడి రిక్వెస్ట్  - MicTv.in - Telugu News
mictv telugu

సాయంత్రమైనా వైన్స్ తెరవండి.. నటుడి రిక్వెస్ట్ 

March 28, 2020

Rishi Kapoor Wants Govt to Open Licensed Liquor Stores Briefly Because People 'Need Some Release'

‘హతవిధీ.. ఈ లాక్‌డౌన్‌తో మాకెంత కష్టం వచ్చె. రోజూ సాయంత్రం అవగానే ఇంత మందుతో గొంతు తడుపుకుని, కంటినిండా నిద్రపోయేవాళ్లం. ఇప్పుడు అది దొరక్క మా ప్రాణాలు పోయేలా ఉన్నాయి’ ఇలా ఇప్పుడుసాయంత్రమైనా వైన్స్ తెరవండి.. నటుడి రిక్వెస్ట్  మందుబాబులను కదిలిస్తే వలవలా ఏడ్చినంత పనే చేస్తున్నారు. దయచేసి మా మందుబాబుల కోసం మద్యం షాపులు సాయంత్రం ఓ గంట తెరిచినా చాలు అని ఇటీవల వేడుకుంటున్న వీడియోలు కొన్ని మనం చూశాం. అయితే వారికి సపోర్ట్ చేసేవారు లేక ఆ డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోవడంలేదేమో. అయితే వారికి నేనున్నాను అంటూ బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ వచ్చారు. ‘రాష్ట్ర ప్రభుత్వాలకి ఎక్సైజ్ శాఖ నుంచి డబ్బు చాలా అవసరం. అందుకోసం కొంత కాలం లైసెన్స్ పొందిన మద్యం దుకాణాలని సాయంత్రం సమయంలో తెరవాలి. ఈ విషయంలో నన్ను తిట్టవద్దు. మనిషి ఇంట్లో అనిశ్చితి, నిరాశలో ఉంటాడు. ఇలాంటి సమయంలో పోలీసులు, వైద్యులు, పౌరులకి మద్యం అవసరం. బ్లాక్‌లో అయిన మద్యం అమ్మే ఏర్పాట్లు చేయండి’ అని రిషి కపూర్ ట్వీట్ చేశారు. 

ఆయన ట్వీట్‌పై నెటిజన్లు కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తోంటే.. మరికొందరు మందుబాబుల మనసును అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు అంటున్నారు. ‘విసుగు చెందిన మనస్సుతో తాగడం మరింత ప్రమాదకరం’ అని ఒకరు సెటైర్ వేశారు. కాగా, కరోనా ప్రభావం రోజురోజుకి పెరుగుతోంది. మనదేశంలోను కరోనా పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో నిత్యావసర వస్తువులు తప్ప ఏవీ ప్రజలకి అందుబాటులో లేకుండాపోయాయి. మద్యం షాపులు కూడా మూతపడటంతో మందుబాబులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.