Rishi Sunak enters fray for UK PM's post
mictv telugu

‘ప్రధాని పదవికి పోటీపడుతున్నా’ .. రిషి సునాక్ ట్వీట్

October 23, 2022

ప్రధాని పదవికి తాను పోటీ పడుతున్నట్లు బ్రిటన్‌ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ ట్విటర్‌ వేదికగా అధికారికంగా ప్రకటించారు. ప్రధాని పదవితో పాటు కన్జర్వేటివ్‌ పార్టీ నాయకత్వానికి కూడా పోటీపడుతున్నట్లు వెల్లడించారు. గొప్ప దేశమైన యూకే ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉందని, గతంలో ఎన్నడూ ఎదుర్కోనంతగా దేశం సమస్యలను ఎదుర్కొంటోందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ సమస్యలను పరిష్కరించడం కోసం తాను ప్రధాని బరిలో నిలుస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత సమస్యల పరిష్కారానికి తన వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందని ఆయన చెప్పారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన రికార్డు కూడా తనకు ఉందన్నారు. సరైన వారిని ఎంపిక చేసుకుంటేనే అవకాశాలు కూడా అద్భుతంగా ఉంటాయన్నారు. ప్రధాని పదవి రేసులో నిలిచేందుకు అవసరమైన 100 మంది టోరీ పార్టీ ఎంపీల మద్దతు తమ నేతకు లభించిందని సునాక్‌ అనుచరులు శనివారం వెల్లడించారు.