Rishi Sunak was elected Prime Minister of Britain
mictv telugu

బ్రేకింగ్.. బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్.. మనకెంత లాభం?

October 24, 2022

భారతీయ మూలాలున్న రిషి సునాక్ బ్రిటన్ ప్రధాన మంత్రి అయ్యారు. 188 మంది కన్జర్వేటివ్ ఎంపీలు సునాక్‌కు మద్దతు తెలపడంతో ఎన్నిక సునాయాసమైంది. సునాక్ ప్రత్యర్ధి పెన్నీ మెర్డాంట్ కనీస మద్దతు వంద మంది ఎంపీల మద్దతు సంపాదంచలేకపోవడంతో సునాక్ ఎన్నిక లాంఛనమైంది.

ఈ నెల 28న రిషి సునాక్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో ఇతర దేశాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన పదవుల్లో నిలిచిన భారతీయ మూలాలున్న వ్యక్తిగా రిషి నిలిచారు. సొంత పార్టీ నుంచి బోరిస్ జాన్సన్ పోటీ నుంచి తప్పుకోవడం కూడా రిషికి కలిసొచ్చింది. కాగా, 42 ఏళ్ల రిషి సునాక్.. ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి అల్లుడన్న విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు కుమార్తెలు కృష్ణా సునక్, అనౌష్క సునాక్ ఉన్నారు. అయితే రిషి ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా మాజీ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామాకు కారణమైన ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దాలి. తన వద్ద అన్ని సమస్యలకు పరిష్కారం ఉందని రిషి గతంలో చెప్పారు. మరి ఏమేరకు విజయవంతం అవుతాడో చూడాల్సి ఉంది. అటు మనల్ని బానిసలను చేసి అత్యంత క్రూరంగా పాలించిన రవి అస్తమించని సామ్రాజ్యానికి ప్రధాని అయిన రిషి.. మన దేశ ప్రయోజనాలకు ఏ మేరకు ఉపయోగపడతాడో చూడాలి. ఎందుంటే.. పేరుకు భారతీయ మూలాలున్నా.. హిందూ మతం అవలంబిస్తున్నా.. బ్రిటన్ ప్రయోజనాలకే అతను ప్రాధాన్యత ఇస్తాడు. మరి భారత్ – బ్రిటన్ సంబంధాల మధ్య ఏమైనా అనుకూల వాతావరణం ఉంటుందా? లేదా అనేది కాలమే తేలుస్తుంది.