పెరిగిన బంగారం ధర.. ఎంతంటే? - MicTv.in - Telugu News
mictv telugu

పెరిగిన బంగారం ధర.. ఎంతంటే?

March 4, 2022

23

రష్యా–ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న భీకర యుద్ధం కారణంగా పసిడి, వెండి ధరలు పరుగెడుతున్నాయి. బంగారం, వెండి ధరలు ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. గురువారం రోజున రూ. 51,600తో ముగిసిన బంగారం ధర ఈరోజు ఉదయం రూ. 440 పెరిగి రూ. 52,040కు చేరింది. ఇక వెండి విషయానికి వస్తే, తాజాగా రూ. 2,200 రూపాయలు పెరిగి రూ. 67,200కు చేరింది.

ఇక హైదరాబాద్‌లో పసిడి ధర చూస్తే.. 22 కేరట్ల పసిడి ధర రూ. 47,700 పలుకగా 24 కేరట్ల బంగారం ధర రూ. 52,040గా ఉంది. ఉక్రెయిన్,రష్యా దేశల మధ్య కొనసాగుతోన్న ఉద్రిక్తతలతో డాలర్ ఇండెక్స్ కనిష్ఠానికి పడిపోయింది. దీంతో బులియన్ మార్కెట్ పరుగులు పెడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరోపక్క యుద్ధం కారణంగా ఉక్రెయిన్, రష్యా దేశాల నుంచి దిగుమతి అయ్యే చమురు, వంట నూనె వంటి నిలిచిపోవడంతో త్వరలోనే దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజీల్ రేట్లు భారీగా పెరగనున్నాయి. ఇప్పటికే వంట నూనె, గ్యాస్, కూరగాయల ధరలు, చికెన్ ధరలకు కొండెక్కిన విషయం తెలిసిందే.

తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు..

g

1. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20. డీజిల్ ధర రూ.94.62.
2. కరీంనగర్‌లో పెట్రోల్ ధర రూ.108.39., డీజిల్ ధర రూ.95.85.
3. ఖమ్మంలో పెట్రోల్ రూ. 108.94., డీజిల్ ధర రూ.95.29.
4. మెదక్‌లో పెట్రోల్ రూ.108.66., డీజిల్ రూ.95.05.
5. రంగారెడ్డిలో పెట్రోల్ ధర రూ. 108.20., డీజిల్ రూ.94.62.
6. వరంగల్‌లో పెట్రోల్ రూ. 107.69., డీజిల్ ధర రూ.94.14గా ఉంది.