భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే? - MicTv.in - Telugu News
mictv telugu

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

March 9, 2022

gold

ఉక్రెయిన్‌ – రష్యా దేశాల మధ్య నెలకొన్న యుద్ధం కారణంగా గతకొన్ని రోజులుగా నిత్యావసర సరుకుల ధరలు, ఆయిల్ ధరలు, చికెన్ ధరలు రోజురోజుకు పెరుగుతూ సామాన్యులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పసిడి ధరలు సైతం పరుగులు తీస్తున్నాయి. వెండి కూడా అదే దారిలో నడుస్తోంది. ఈ మేరకు మంగళవారం బంగారం, వెండి ధరలు కొద్దిగా తగ్గినా బుధవారం బంగారం ధర భారీగా పెరిగింది. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,400 ఉన్న ధర 1,300 పెరిగి 50,700కు చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 53,890గా ఉండి 1,420లకు పెరిగి 55,310కి చేరింది.

ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 22 కేరట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,300 పెరిగి రూ. 50,700 చేరింది. 24 కేరట్ల బంగారం రూ. 1,420 పెరిగి రూ. 55,310 వద్ద నిలిచింది. కిలో వెండి ధర 3,000 పెరిగి రూ. 77,600 పలుకుతోంది. మరోపక్క అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా పెరుగుతూ రూపాయి విలువను హరించేస్తున్నాయి. ముడి చమురు ధర బ్యారెల్ 129 డాలర్లకు చేరుకోవడంతో అది ఫారెక్స్ మార్కెట్లో రూపాయిపై ఒత్తిళ్లకు దారితీసింది. డాలర్ మారకంలో రూపాయి విలువ జీవిత కాలంలో అత్యంత కనిష్ఠానికి చేరింది.