హైదరాబాద్‌లో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

May 30, 2022

దేశ ప్రజలకు గతవారం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ, కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. లీటరు పెట్రోల్‌పై రూ. 8, డీజిల్‌పై లీటరుకు రూ. 6 తగ్గిస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో వాహనదారులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా తగ్గిన పెట్రోల్ ధరలు సోమవారం మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 17 పైసలు, లీటర్ డీజిల్‌పై 16 పైసలు పెంచుతూ చమురు సంస్థలు షాక్‌నిచ్చాయి. పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.109.83కి చేరింది. లీటర్ డీజిల్ రూ.97.98కి చేరింది.

మరోవైపు ఏపీలోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 11 పైసలు తగ్గి రూ.111.92గా నమోదైంది. లీటర్ డీజిల్ 9 పైసలు తగ్గి రూ.99.65కి చేరింది. 10 రోజుల కిందట పెట్రోల్ ధరలు భారీగా పెరిగి లీటరు ధర రూ.120 దాటింది. కేంద్ర ప్రభుత్వం ఎక్సెజ్ సుంకాన్ని మరోసారి తగ్గించడంతో పెట్రోల్ ధరల్లో భారీ ఎత్తున మార్పు కనిపించింది. మే 30 నాటికి ధరల ప్రకారం.. అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధర 116.04 డాలర్ల స్థాయిని చేరినట్లు అధికారులు తెలిపారు.