మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌! - MicTv.in - Telugu News
mictv telugu

మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌!

March 23, 2022

08

భారతదేశంలో అందరూ ఊహించినట్టుగానే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముగిసిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని అందరు అనుకున్నట్టుగానే వాహనదారులపై పెట్రో బాదుడు షురూ అయ్యింది. ఈ నేపథ్యంలో గతేడాది నవంబర్ 4తేదీన చివరిసారిగా డీజిల్‌,పెట్రోల్‌ ధరలు పెరిగాయి. అయితే, అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇప్పుడు మళ్లీ పెట్రోల్‌ ధరల పెంపు ప్రారంభమైంది. దీంతో బుధవారం లీటర్‌ పెట్రోల్‌పై 90పైసలు, డీజిల్‌పై 84పైసలు పెరిగాయి.

మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు గరిష్టానికి చేరుకున్నాయి. దీంతో రోజురోజుకు చమురు సంస్థల్లో నష్టాలు పెరుగుతుండడంతో పెట్రోల్ ధరల పెంపు అనివార్యమైందని నిపుణులు చేప్తున్నారు.

ప్రస్తుతం పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..

1.హైదరాబాద్‌లో..
లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.110గా
డీజిల్‌ ధర రూ.96.36గా ఉంది.

2. గుంటూరులో..
లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.112.08గా
డీజిల్‌ ధర రూ.98.10గా ఉంది.

3. విజయవాడలో..
లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.111.99గా
డీజిల్‌ ధర రూ.97.90 ఉంది.

4. న్యూఢిల్లీలో..
లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.21గా
లీటర్‌ డీజిల్‌ ధర రూ.87.47గా ఉంది.

5. ముంబైలో..
లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.110.82గా
డీజిల్‌ ధర రూ.95.00గా ఉంది.

6. కోల్‌కతాలో..
లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.105.51గా
డీజిల్‌ ధర రూ.90.62గా ఉంది.

7. చెన్నైలో..
లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.102.16గా
డీజిల్‌ ధర రూ.92.19గా ఉంది.

8. బెంగళూరులో..
లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.101.42గా
డీజిల్‌ ధర రూ.85.80పైసలుగా ఉన్నాయి.