గురక పెట్టేవారికి కరోనా సోకే ప్రమాదం! - MicTv.in - Telugu News
mictv telugu

గురక పెట్టేవారికి కరోనా సోకే ప్రమాదం!

September 21, 2020

Risk of corona infection in snorers!

వయసు మళ్లినవారికి, గుండె జబ్బులు, ఉబ్బసం, బీపీ షుగర్లు వంటి ఇతరాత్ర జబ్బులు ఉన్నవారికి  కరోనా వైరస్ సోకితే కోలుకోవడం మరింత కష్టం అవుతుంది అని వైద్యులు చెబుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కరోనా వైరస్‌ బారినపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల్లో గురకపెట్టి పడుకునే వాళ్లు ఉన్నట్లయితే వారి ప్రాణాలకు మూడు రెట్లు ప్రమాదం ఎక్కువని పరిశోధకులు తేల్చి చెప్పారు. కరోనా వైరస్, నిద్రకు ఉన్న సంబంధంపై ఇప్పటివరకు 18 అధ్యయనాలు జరిపిన వార్‌విక్‌ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు పరిశీలించి ఈ విషయాన్ని తేల్చారు. గురక పెడుతూ నిద్రపోయేవారిలో కండరాలు విశ్రాంతి తీసుకున్నప్పుడు కొన్ని క్షణాలపాటు తాత్కాలికంగా శ్వాసనాళంలోకి గాలి సరిగ్గా పోదని, ఫలితంగా వారికి ప్రాణాపాయం ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉందని అంటున్నారు.  

గురక పెట్టేవాళ్లకు కరోనా సోకడం ఒక ప్రమాద కారకమే కానీ, అదనపు ప్రమాద కారకం కాదని పరిశోధకులు వివరించారు. ‘స్థూలకాయం, బీపీ, షుగర్ ఉన్నట్లయితే ఆ మూడే వారికి ప్రమాదం. వారిలో గురుకపెట్టే వారు ఉన్నట్లయితే వారికి అది అదనపు ప్రమాద కారకం కాదు. వాస్తవానికి ఈ మూడు అనారోగ్య సమస్యలు ఉన్నవారందరికి గురకపెట్టే అలవాటు వస్తుంది’ అని పరిశోధకులు వెల్లడించారు. కాగా, ఇంగ్లండ్‌లో 15 లక్షల మంది, అమెరికాలో 2.20 కోట్ల మంది గురక సమస్యతో బాధ పడుతున్నారని వివరించారు.