RITIKA SINGH :i cried a lot after completion of the shoot said ritika
mictv telugu

ఆ బాధ భరించలేకపోయాను..అందుకే ఏడ్చేశాను

March 3, 2023

RITIKA SINGH :i cried a lot after completion of the shoot said ritika

ఓ సక్కనోడా పట్టు పిడికిలి…అంటూ గురు సినిమాలో వెంకటేశ్‏తో జోడీ కట్టి, బాక్సర్ గా నటించి తెలుగు ఇండస్ట్రీలో తనదైన క్రేజ్‏ను సంపాదించుకుంది ముద్దుగుమ్మ రితికా సింగ్. మొదటి సినిమాతోనే తనదైన వైవిధ్యమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది ఈ భామ. ప్రస్తుతం తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో అమ్మడికి అందివస్తున్న అవకాశాలను వినియోగించుకుంటూ కెరీర్ లో కంటిన్యూ అవుతోంది. తాజాగా రితికా ఇన్‏కార్ చిత్రంతో మరోసారి తెరముందు సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఐదు భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో రితికా ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ క్రమంలో మూవీ యూనిట్ నిర్వహించిన మీడియా కాన్ఫరెన్స్ లో రితికా మూవీకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను, షూట్ సమయంలో తన ఎక్స్‏పీరియన్స్ ను పంచుకుంది.

ఇన్‏కార్ చిత్రం అంతా కూడా ఒకే రోజులో జరిగే కథ. ఓ అమ్మాయిని కిడ్నాపర్లు కిడ్నాప్ చేస్తారు. మూవీ మొత్తం ఈ కిడ్నాప్ చుట్టూనే తిరుగుతుంటుంది. అసలు ఆ అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేశారు? ఎందుకు కిడ్నాప్ చేశారు? రాత్రికి రాత్రే ఆ అమ్మాయికి ఏమవుతుంది? కిడ్నాపర్ల చెర నుంచి ఆ అమ్మాయి ఎలా బయటపడింది.? అనేది కథ. ఈ మూవీ మొత్తం ఒకే డ్రెస్ లో కనిపించనుంది రితికా.”ఇలా ఒకే కాస్ట్యూమ్ ను సినిమా మొత్తం మెయిన్‏టైన్ చేయడం చాలా కష్టం , ఈ మూవీలో నా పాత్రకు నేను బాగా కనెక్ట్ అయ్యాను అని రితిక తెలిపింది.

ఆ సీన్ బాధించింది :

“ఈ సినిమాలో ఒక సీన్ నన్ను బాధించింది. డైరెక్టర్ కట్ చెప్పగానే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. వెంటనే పక్కకు వచ్చి ఏడ్చేశాను. షూటింగ్ స్పాట్ నుంచి బయటకు వెళ్లిన తరువాత కారు దిగి కాసేపు ఒంటరిగా గడిపాను. ఆ సీన్ లో అందరూ నన్ను తిడతారు. అది నేను భరించలేకపోయాను. ఎందుకంటే నా క్యరెక్టర్ కు నేను బాగా కనెక్ట్ అయ్యాను “అని రితికా చెప్పింది.

రితికా సింగ్ ఓ మార్షల్ ఆర్టిస్ట్. 2009లో ఏషియన్ ఇండియన్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేసిన తరువాత గేమ్స్ కు బైబై చెప్పేసి సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. రితికా మొదటిసారిగా ఇరుది సుట్రు అనే తమిళ సినిమాలో మాధవన్ సరసన హీరోయిన్ గా నటించింది. ఇదే కథ హిందీ, తెలుగులోనూ విడుదలైంది. అక్కడ కూడా రితికానే ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమాలో రితికా నటనకు గాను విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. అంతే కాదు మూడుసార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులను గెలుచుకుంది రితికా. గురు చిత్రం తరువాత శివలింగ, నీవెవరో, ఓ మై కడువలే వంటి సినిమాల్లో నటించింది . ప్రస్తుతం ఇన్‏కార్ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించబోతోంది ఈ బ్యూటీ.