ఉత్తరాఖండ్ తొలి మహిళా సీఎంగా రీతూ ఖండూరీ! - MicTv.in - Telugu News
mictv telugu

ఉత్తరాఖండ్ తొలి మహిళా సీఎంగా రీతూ ఖండూరీ!

March 14, 2022

 

bddgggggg

దేవభూమి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తొలిసారి మహిళ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కోట్‌ద్వార్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రీతూ ఖండూరీని సీఎంగా చేసే ఆలోచనల్లో ప్రధాని మోదీ ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో మహిళలు బీజేపీకి భారీ సంఖ్యలో ఓటు వేసినందున ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇక రీతూ ఖండూరి తండ్రి బీసీ ఖండూరి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈమె భర్త రాజేష్ భూషణ్ కేంద్ర ఆరోగ్య శాఖలో సీనియర్ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా సమయంలో తన పనితీరుతో కేంద్ర క్యాబినెట్ ద్వారా ప్రశంసలు అందుకున్న వ్యక్తి. ఈ రకంగా రాజేష్ భూషణ్, ప్రధాని మోదీల మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. ఇన్ని సానుకూలతల నేపథ్యంలో మోదీ రీతూ ఖండూరీ వైపు మొగ్గు చూపినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ విషయంపై ఢిల్లీలో నిర్వహించిన సమావేశానికి అధిష్టానం రీతూను పిలవడంతో ముఖ్యమంత్రిగా ఖరారైపోయినట్టేనని జోరుగా ప్రచారం జరుగుతోంది.