Rivaba Jadeja feature on BJP's first list
mictv telugu

గుజరాత్ బరిలో జడేజా భార్య రివాబా

November 10, 2022

గుజరాత్ ఎన్నికల్లో రవీంద్రజడేజా భార్య రివాబా పోటీ చేస్తున్నారు. బీజేపీ ప్రకటించిన తొలి లిస్టులోనే ఈమె పేరు ఉంది. నార్త్ జామ్‌నగర్ టికెట్‌ను రివాబాకు బీజేపీ ఇచ్చింది. నార్త్ జామ్ నగర్‌లో ఈమె గెలుస్తుందా? అక్కడ కాషాయ జెండా ఎగరేస్తుందా? ఇక ఫస్ట్ లిస్టులో బీజేపీ ఇచ్చిన ట్విస్టులు ఏంటి?

తొలి జాబితా విడుదల
గుజరాత్ ఎన్నికల్లో పోటిచేస్తున్న అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈసారి కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఘాట్లోడియా నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ పటేల్ పోటి చేస్తున్నారు. 38 మంది సిట్టింగ్ లకు హైకమాండ్ షాక్ ఇచ్చింది. వీరి స్థానాల్లో కొత్తవారికి అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన హర్దిక్ పటేల్‌తో పాటు మరికొందరికి టికెట్లు ఇచ్చింది. నార్త్ జామ్‌నగర్ నుంచి రవీంద్రజడేజా భార్య రివాబా జడేజాను పోటి చేయిస్తోంది.

ఎవరీ రివాబా
రివాబా క్రికెటర్ రవీంద్రజడేజా భార్య. 2016లో వీరి పెళ్లి అయింది.అంతకు ముందు రివాబా సోలంకిగా అందరికి తెలుసు. హర్దీవ్ సింగ్ సోలంకి-ప్రఫుల్లబో సోలంకిల కూతురు. రివాబా సెప్టెంబర్ 5 ,1990లో జన్మించింది.32 ఏళ్ల రివాబా 2018లో బీజేపీలో చేరింది. రాజ్ కోట్‌లోని ఆత్మీయ ఇనిస్టిట్యూట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజ్ మోకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. కర్ణి సేన మహిళా విభాగం అధ్యక్షురాలి పరిచయంతో బీజేపీలో చేరింది.2019 నుంచి బీజేపీలో యాక్టివ్ గా పనిచేస్తోంది.

సిట్టింగ్ లకు షాక్
గుజరాత్ లో డిసెంబర్ 1, 5 తేదీలతో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది.డిసెంబర్ 8 న ఓట్లని లెక్కిస్తారు. వరుసగా ఏడోసారి బీజేపీ అధికారంలోకి రావాలని ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది. ఇటీవల కాంగ్రెస్ నుంచి నాయకులకు టికెట్లు ఇచ్చిన బీజేపీ ..38 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చింది.