rivaba jadeja removed the tweet after unexpected results on poll
mictv telugu

క్రికెటర్ జడేజా భార్యకు ఊహించని షాక్..

November 18, 2022

rivaba jadeja removed the tweet after unexpected results on poll

టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆమె గుజరాత్‌లోని జామ్నగర్ నార్త్ నుంచి పోటీ చేయనున్నారు. గుజరాత్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ ఏర్పాటుపై సోషల్ మీడియా వేదికగా చాలా సర్వేలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రివాబా జడేజా కూడా “గుజరాత్ అసెంబ్లీలో విజయం ఎవరిది” అంటూ ట్విటర్లో ఒపినియన్ పోల్ నిర్వహించారు. అయితే ఆ పోల్ ఫలితాలు ఆమెకి షాకిచ్చాయి.

ట్విటర్‌లో పోల్ రిజల్ట్స్ ఆమె ఊహించినట్లుగా రాలేదు. పోల్‌లో 63 శాతం మంది ఆప్కు మద్దతు ఇవ్వగా, 25 శాతం బీజేపికి మద్దతిచ్చారు. మరో 10 శాతం మంది కాంగ్రేస్‌కు మద్దతు తెలిపారు.”దేశ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు” అంటూ ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ పేర్లను ట్యాగ్ చేసిన మరో పోస్టుకు కూడా అలాంటి రిజల్ట్సే వచ్చాయి. అరవింద్ కేజ్రీవాల్‌కు 68 శాతం ఓటు వేయగా, నరేంద్ర మోదీకి 22 శాతం మంది మద్దతు ఇచ్చారు. రాహుల్ గాంధీకి 10 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.