ఉల్లి మంట అసెంబ్లీకి తాకింది..ఎమ్మెల్యే వినూత్న నిరసన - MicTv.in - Telugu News
mictv telugu

ఉల్లి మంట అసెంబ్లీకి తాకింది..ఎమ్మెల్యే వినూత్న నిరసన

November 27, 2019

ఉల్లిధరలు దేశవ్యాప్తంగా ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తోంది. దాన్ని కొనాలంటేనే పెద్ద సాహసం చేసినంతగా అయిపోయింది ప్రస్తుత పరిస్థితి. కిలో ఉల్లి రూ. 80 పలుకుతుండటంతో సామాన్యులే కాదు.. ధనవంతులు కూడా సాహసం చేయలేకపోతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో అయితే ప్రభుత్వాలే ఉల్లి కేంద్రాలను ఏర్పాటు చేసి రాయితీపై ఇస్తున్నాయి. బిహార్‌లోఉల్లిధరలను కట్టడి చేయకపోవడంపై ఆర్జేడీ ఎమ్మెల్యే వినూత్న నిరసన చేపట్టారు. ఉల్లి దండ మెడలో వేసుకొని ప్రభుత్వం తీరును ఎండగట్టారు. 

RJD MLA Shivchandra Ram.

శీతాకాల సమావేశాల సందర్భంగా ఆర్జేడీ ఎమ్మెల్యే శివచంద్ర రామ్ వినూత్నంగా నిరసన తెలిపారు. ఉల్లి దండను మెడలో వేసుకొని విధాన సభ ఎదుట నిరసనకు దిగాడు. సామాన్యులకు నిత్యావసర ధరలు పెరగకుండా చేస్తామని అధికారంలోకి వచ్చిన నితీశ్ ప్రభుత్వం ఆ దిశగా పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం తరుపున ఎటువంటి ఉల్లి కౌంటర్లు ఏర్పాటు చేయలేదని అన్నారు. తాను ఉల్లిదండతో సభలోకి వెళ్తే అయినా సీఎంకు ఈ విషయం గుర్తుకు వస్తుందేమో అంటూ వ్యాఖ్యానించారు. ధరలు అమాంతం పెరగడం వల్ల ప్రజలు  ఇబ్బందులు పడుతున్నారని దీనిపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు.