కడప జిల్లాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న ఆలయంలోకి మెట్లపైకి ఎక్కేసింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. పలువురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన రాజంపేట మండలం గుండ్లూరులో చోటు చేసుకుంది.బుధవారం ఉదయం బహుదానది వద్ద ఉన్న సాయిబాబా ఆలయంవైపు ఓ లారీ వేగంగా దూసుకొచ్చింది. ఈ క్రమంలో లారీ భారీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా పలువురు కింద పడ్డారు. దీంతో లారీ వారిని ఢీ కొట్టడంతో.. ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం అనంతరం డ్రైవర్ పరారయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.