పుట్టు వెంట్రుకలు తీయించేందుకు వెళ్తుండగా ఘోరం.. - MicTv.in - Telugu News
mictv telugu

పుట్టు వెంట్రుకలు తీయించేందుకు వెళ్తుండగా ఘోరం..

October 17, 2018

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగిఉన్న టాటా ఏస్ వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 15మందికి తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. మృతుల్లో ముగ్గురు యువకులు, ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. ఈ ఘటన ఆలూరు మండలంలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.Road Accident At Kurnool District.. 6 People Dead, 15 Members Injuredఅయితే ఓ చిన్నారికి పుట్టు వెంట్రుకలు తీయించేందుకు ఎల్లార్తి దర్గాకు వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఒకే వాహనంలో మూడు కుటుంబాలకు చెందిన 21 మంది ఉన్నారు. వీరంతా కర్నూలు వన్‌టౌన్‌కు చెందినవారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందడంతో అందరు కన్నీరుమున్నీరు అవుతున్నారు.