ఔటర్‌పై రోడ్డు ప్రమాదం.. లారీ దగ్ధం - MicTv.in - Telugu News
mictv telugu

ఔటర్‌పై రోడ్డు ప్రమాదం.. లారీ దగ్ధం

May 26, 2019

Road Accident At Outer Ring Road Near Rajendra Nagar, Hyderabad.

రాజేంద్రనగర్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీకొన్న ఘటనలో లారీ దగ్ధమైంది. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వైపు ఏషియన్ పెయింట్ డబ్బాల లోడ్‌తో వెళ్తున్న లారీ ఖాలీజ్‌ఖాన్ దర్గా సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు రాగానే.. వేగంగా వచ్చి కారు వెనుక నుంచి ఢీకొట్టింది.  

దీంతో కారులో ఉన్న వ్యక్తి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఓఆర్‌ఆర్ పెట్రోలింగ్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే లారీలో పెయింట్ డబ్బాలు ఉండటంతోనే మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.