పంతంగి టోల్‌ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం - MicTv.in - Telugu News
mictv telugu

పంతంగి టోల్‌ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం

May 21, 2019

Road Accident At Panthangi Toll Plaza.. RTC Bus driver dead On The Spot.. 10 people Injured.

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పంతంగి టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. పదిమందికి తీవ్ర గాయలయ్యాయి.

విజయవాడ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న విజయవాడ డిపోకి చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్దకు రాగానే ముందున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ శీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న మరో పది మందికి గాయాలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే ముందున్న వాహన డ్రైవర్ అప్రమత్తమై అక్కడినుంచి పరారయ్యాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలను కనుకునేందుకు చర్యలు చేపట్టారు. ఇందుకోసం టోల్‌ ప్లాజా వద్ద ఉన్న సీసీ టీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.