పోలీస్ జీపు, కారు ఢీ‌.. ఎస్ఐ సహా పలువురికి గాయాలు - MicTv.in - Telugu News
mictv telugu

పోలీస్ జీపు, కారు ఢీ‌.. ఎస్ఐ సహా పలువురికి గాయాలు

May 26, 2019

Road Accident At prakasam District Pamuru Kanigiri National Highway.

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పామూరు కనిగిరి జాతీయ రహదారిపై ఆదివారం పోలీస్ జీపు, ఓ కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో జీపులో ఉన్న పామూరు ఎస్‌ఐ రాజ్ కుమార్‌తో పాటు నలుగురు సిబ్బందికి, కారు ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కారు డ్రైవర్, జీప్ డ్రైవ్ చేసిన హోం గార్డు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.