ఆందోల్‌లో ఆర్టీసీ బస్సు, ఆల్టో కారు ఢీ.. ఇద్దరు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

ఆందోల్‌లో ఆర్టీసీ బస్సు, ఆల్టో కారు ఢీ.. ఇద్దరు మృతి

April 12, 2019

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు, ఆల్టో కారు ఢీకొని ఇద్దరు యవకులు అక్కడికక్కడే మృతిచెందారు. నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సంగారెడ్డి వైపుకు వస్తుండగా.. సంగారెడ్డి నుంచి ఆందోల్ వెళ్తున్న ఆల్టో కారు వేగంగా వెళ్లి బస్సును ఢీ కొట్టింది.

Road Accident At Sangareddy District Andole.. 2 People Dead.. 2 people Injured.

దీంతో కారులో ఉన్న ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. బస్సులోని ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కారు డ్రైవర్ అతివేగంతో ప్రమాదం చోటు చేసుకుందని ఆర్టీసీ బస్సు డ్రైవర్ పేర్కొంటున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాల కోసం ఆరా తీస్తున్నారు.